Breaking News

రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు 

Published on Thu, 02/29/2024 - 01:27

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వారం రోజులుగా సాధారణం కంటే తక్కువగా నమోదైన ఉష్ణోగ్రతలు ఇప్పుడు 2 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా నమోదవుతున్నాయి. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 36.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత హకీంపేట్‌లో 18.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. చాలాచోట్ల గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి.

ఖమ్మంలో సాధారణం కంటే 4 డిగ్రీల సెల్సీయస్‌ అధికంగా నమోదు కాగా...ఆదిలాబాద్‌లో 2 డిగ్రీల సెల్సియస్, మిగతాచోట్ల ఒక డిగ్రీల సెల్సియస్‌  మేర అధికంగా నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం ఉంటుందని, తేమశాతం తగ్గడంతో ఉక్కపోత కూడా పెరుగుతుందని వాతావరణ శాఖ వివరించింది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)