ఇంట్లోనే.. రిలీఫ్‌..! డయాబెటిస్‌పై పోరుకు మెడిసినల్‌ ప్లాంట్స్‌ సాయం!

Published on Fri, 08/09/2024 - 13:41

డయాబెటిస్, బీపీ తదితర దీర్ఘకాలిక వ్యాధులు నగరవాసులకు వీడని నీడలుగా మారుతున్నాయి. వైద్యసాయం తీసుకుంటున్నా, మందులు వాడుతున్నా.. తగ్గేదెలే.. అన్నట్టుగా వదలకుండా వెంటాడుతున్న వ్యాధుల విషయంలో కొందరు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా ఇంట్లోనే మెడిసినల్‌ ప్లాంట్స్‌ను సైతం పెంచుకుంటున్నారు. – సాక్షి, సిటీబ్యూరో

రక్తంలో చక్కెర స్థాయిలు, మధుమేహాన్ని నియంత్రించడానికి, ఇన్సులిన్‌ సహా అనేక రకాల మందులు చికిత్సలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే కారణాలేవైనా.. కొందరు ప్రత్యామ్నాయ విధానాలను  ప్రయత్నిస్తున్నారు. మధుమేహంతో పోరాడేందుకు ఔషధ మొక్కలను పెంచుతున్నారు మాజీ సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు మొట్టమర్రి సందీప్‌.

టెర్రస్‌లో.. ట్రీట్‌మెంట్‌..
ఇన్సులిన్‌ మొక్క ఆకులు మధుమేహం నిర్వహణలో ఉపయోగపడతాయని, ఇన్సులిన్‌ మొక్కల ప్రయోజనాలను గుర్తించి, వాటిని మొహిదీపట్నంలోని తన ఇంటి టెర్రస్‌పై సేంద్రీయంగా పెంచడం ప్రారంభించారు సందీప్‌. తన మధుమేహం చికిత్స కోసం ఈ సహజమైన విధానాన్ని ఆయన అనుసరించాడు. తన టెర్రస్‌ను ఆరోగ్యానికి తోటగా మార్చాడు. మందులు, ఇంజెక్షన్లకు బదులు ఇన్సులిన్‌ ఆకులను తీసుకోవడం ద్వారా, ఏడు సంవత్సరాలుగా తన మధుమేహాన్ని అదుపులో ఉంచుకోగలిగానని ఆయన అంటున్నారు. ‘నేను మందులు మానేసి ఏడేళ్లుగా ఇన్సులిన్‌ మొక్క ఆకులను తీసుకుంటున్నాను. దాంతో ఈ ఏడేళ్లలో డాక్టర్‌ను కలవాల్సిన అవసరం రాలేదు’ అని ఆయన చెప్పారు. ఆయన చెబుతున్న ప్రకారం.. ఇన్సులిన్‌ ప్లాంట్‌ తగిన స్థాయిలో పరిపక్వానికి చేరేందుకు దాదాపు నాలుగు నెలల సమయం పడుతుంది.  

పెంపకం.. పంపకం.. 
ఇన్సులిన్‌ మొక్కలతో పాటు అతను కొన్ని కూరగాయలతో పాటు రణపాల వివిధ రకాల తులసి వంటి ఇతర ఔషధ మొక్కలను కూడా ఆయన పెంచుతున్నారు. ఆయన దగ్గర ఉన్న మెడిసినల్‌ ఇన్సులిన్‌ ప్లాంట్ల గురించి ఆ నోటా.. ఈ నోటా విని సుదూర ప్రాంతాల నుంచీ కాల్స్‌ వస్తుంటాయన్నారాయన. ఓపికగా మొక్క ప్రయోజనాలను వివరిస్తానని, మొక్కలను తీసుకెళ్లడానికి వచ్చే వ్యక్తులకు నామమాత్రపు ధరకు వాటిని అందిస్తూనే, మొక్కలను పెంచే చిట్కాలను చెప్తానన్నారు. ‘ఆకులను క్రమం తప్పకుండా తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు క్షీణించడాన్ని గమనించినట్లు చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు’ అని ఆయన చెప్పారు. అయితే ఒక రోజులో 2 కంటే ఎక్కువ ఆకులను వాడొద్దని ఆయన సలహా ఇస్తారు. అధిక మోతాదు కారణంగా సంభవించే ప్రమాదాలను నివారించడానికి ఉదయం ఒక ఆకు సాయంత్రం మరో ఆకును తీసుకోవాలని సూచిస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)