క్యాబ్‌ ఎక్కాలంటేనే భయం!

Published on Fri, 07/24/2026 - 08:09

  • శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి రెండురోజుల క్రితం క్యాబ్‌లో నగరానికి వస్తున్న ఓ ఎయిర్‌లైన్స్‌కు చెందిన మహిళా ఉద్యోగిపై క్యాబ్‌ డ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

  • 6 నెలల క్రితం ఈసీఐఎల్‌ నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించిన క్యాబ్‌ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో తరచూ ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. క్యాబ్‌లు, ఆటోలు తదితర ప్రైవేట్‌ వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఒంటరిగా ప్రయాణం చేసే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు పాల్పడడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో బాధితులు పోలీసులను ఆశ్రయించినప్పుడే కేసులు నమోదవుతున్నాయి. కానీ నిశి్చంతగా, నిర్భయంగా ప్రయాణం చేసే సదుపాయం మాత్రం అందుబాటులోకి రావడం లేదు. అభయ, దిశ ఉదంతాల తర్వాత  ప్రతి వాహనానికీ ట్రాకింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని రవాణాశాఖ నిర్ణయించినా అది అమలులోకి రాకపోవడం దురదృష్టకరం.

రహదారి భద్రతా చట్టంపై నిర్లక్ష్యం..
కేంద్రం రూపొందించిన రహదారి భద్రతా చట్టం  ప్రకారం అన్ని రకాల రవాణా వాహనాల్లో  వెహికల్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌ డివైజ్‌ (వీఎల్‌టీడీ) తప్పనిసరిగా ఉండాలి. ఈ వ్యవస్థను కలిగిన వాహనాలకే రవాణాశాఖ ఫిట్‌నెస్‌ ధ్రువీకరించాలి. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో దీన్ని పటిష్టంగా అమలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో మాత్రం ఇప్పటి వరకూ అమలులోకి రాలేదు. మహిళా ప్రయాణికుల భద్రతతో పాటు అన్ని వర్గాల ప్రయాణికుల భద్రత దృష్ట్యా వీఎల్‌టీడీ ఎంతో అవసరం. దీంతో  జీపీఎస్‌ ట్రాకర్‌ ద్వారా వాహనం రియల్‌టైమ్‌ లొకేషన్‌ నమోదవుతుంది. వాహనం వేగం, రూట్‌ చరిత్ర వంటివి నిక్షిప్తమవుతాయి. ప్రమాదాలు జరిగినప్పుడు రెస్క్యూ సిబ్బంది త్వరతిగతిన అక్కడికి చేరుకోవచ్చు. ఆర్టీసీ, ప్రైవేట్, స్కూల్‌ బస్సులు, క్యాబ్‌లు, ఆటోలు, మ్యాక్సీ క్యాబ్‌లతో పాటు వస్తు రవాణా వాహనాలకు కూడా వీఎల్‌టీడీ తప్పనిసరి అని చట్టంలో ఉంది.

వాహన్‌తో  అనుసంధానం..
వీఎల్‌టీడీ కలిగిన వాహనాలకు  మాత్రమే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు అందజేసేలా వాహన్‌ పోర్టల్‌లో మార్పులు చేశారు. అన్ని మెట్రో నగరాల్లో ఇది అమల్లో ఉంది. హైదరాబాద్‌లో మాత్రం ఇంకా అమల్లోకి రాలేదు. వీఎల్‌టీడీ లేకపోయినా ఆర్టీఏ అధికారులు  ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. గతంలో స్కూల్‌ బస్సులకు ట్రాకింగ్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అప్పట్లో పాలెం బస్సు దగ్ధం నేపథ్యంలోనూ  ఈ ప్రతిపాదన ముందుకొచి్చనా ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)