Breaking News

పీటలపై పెళ్లికొడుకు వేషాలు.. బండి కొనిస్తేనే పెళ్లి చేసుకుంటా!

Published on Sat, 05/13/2023 - 04:04

శంకరపట్నం (మానకొండూర్‌): పెళ్లికూతురు మెడలో తాళికట్టే సమయానికి బండి కొనిస్తేనే పెళ్లి చేసుకుంటా.. అని వరుడు మొండికేయడంతో అతిథిగా వెళ్లిన ఎమ్మెల్యే తానుబండి కొనిస్తా అని డబ్బులు ఇచ్చి వివాహంజరిపించిన ఘటన కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్‌లో చోటుచేసుకుంది. శంకరపట్నం మండలం అంబాల్‌పూర్‌ మాజీ సర్పంచ్‌ గాజుల లచ్చమ్మ, మాజీ ఉపసర్పంచ్‌ మల్లయ్య కూతురు అనూష వివాహం సైదాపూర్‌ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన సంఘాల వినయ్‌తో కుదిరింది.

రూ.5 లక్షల కట్నంతో పాటు మోటార్‌ సైకిల్‌ కొనిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. కట్నం డబ్బులు ముట్టచెప్పారు. మొలంగూర్‌ శివారులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం పెళ్లి మండపానికి వధువు, వరుడి బంధువులు చేరుకున్నారు. కొత్తజంటను ఆశీర్వదించేందుకు మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కూడా హాజరయ్యారు. తీరా.. తాళికట్టే సమయంలో మోటార్‌ సైకిల్‌ కొనిస్తేనే పెళ్లి చేసుకుంటా.. అని వరుడు వినయ్‌ మొండికేశాడు.

దీంతో వరుడు, వధువు బంధువులు గొడవకు దిగడంతో ఎమ్మెల్యే రసమయి జోక్యం చేసుకుని పెళ్లి కొడుకు వినయ్‌తో మాట్లాడి మోటార్‌ సైకిల్‌ కొనుక్కోమని సొంత డబ్బులను (సుమారు రూ.50వేలు) అప్పటికప్పుడే పందిట్లోనే అందించారు. మిగతా సొమ్ము కూడా తానే ఇస్తానని హామీ ఇచ్చారు. అనంతరం దగ్గరుండి వివాహం జరిపించి నూతన జంటను ఆశీర్వదించారు. తోడబుట్టిన అన్నగా పెళ్లి మండపంలో పరువు కాపాడావని మాజీ సర్పంచ్‌ గాజుల లచ్చమ్మ కన్నీరు పెట్టుకుంది.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు