భర్తకు కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి..

Published on Wed, 07/16/2025 - 11:18

వర్ధన్నపేట: కుటుంబ కలహాల కారణంగా ఓ భార్య కూల్‌డ్రింక్‌లో గడ్డి మందు కలిపి భర్తకు ఇవ్వడంతో తీవ్ర అనారోగ్యానికి గురైన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. వర్ధన్నపేట ఎస్సై చందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం భవానికుంట తండాకు చెందిన జాటోతు బాలాజీ (44) ఈనెల 8న తండాలోని తన నివాసంలో దాటుడు పండుగ జరుపుకున్నాడు. పండుగ సందర్భంగా సాయంత్రం ఏడు గంటల సమయంలో బాలాజీ తాను మద్యం సేవించేందుకు బయటికి వెళ్తున్నానని భార్య కాంతికి చెప్పాడు.

 బయటికి వెళ్లొద్దని, ఇంట్లోనే మద్యం ఉందని చెప్పిన భార్య, వంటింట్లోకి వెళ్లి ఒక గ్లాసులో కూల్‌డ్రింక్‌లో గడ్డి మందు కలిపి బాలాజీకి ఇచ్చింది. ఇది తాగిన కొద్దిసేపటికే బాలాజీ గొంతులో నొప్పిగా ఉందని చెప్పడంతో కాంతి అతన్ని వదిలిపెట్టి అదే తండాలో ఉండే తన బావ అయిన వాంకుడోతు దశరు ఇంటికి వెళ్లింది. బాలాజీ పరిస్థితిని గమనించిన తండావాసులు వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యుల సూచనల మేరకు వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. 

ఎంజీఎంనుంచి ఈనెల 13న హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించినట్లు ఎస్‌ఐ తెలిపారు. భర్తతో గొడవను మనసులో పెట్టుకున్న కాంతి తన బావ దశరు ప్రోత్సాహంతో గడ్డి మందును ఉద్దేశ పూర్వకంగానే బాలాజీకి తాగించినట్లు చెప్పారు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)