Breaking News

భార్య గొంతు కోసిన భర్త

Published on Sat, 12/27/2025 - 06:08

ఆత్మకూరు: భార్యపై అనుమానం పెంచుకు న్న ఓ భర్త ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన హనుమ కొండ జిల్లా ఆత్మకూ రు మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రా నికి చెందిన అనూష, మంద రవి 2014లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమా ర్తెలు. పెళ్లైన నాలుగేళ్లనుంచి రవి తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. అనూష ఓ గురుకుల పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తుండగా రవి మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తనపై శారీరక, మానసిక వేధింపులు ఎక్కువ కావడంతో రెండు నెలల క్రితం అనూ ష మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్‌ చేసి పంపించారు. అయినా రవి ప్రవర్తనలో మార్పు రాలే దు. గురువారం రాత్రి రవి భార్యతో మరోసారి గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఆమెను పిడిగుద్దులు గుద్దుతూ ఇంట్లోని కత్తి తీసుకుని గొంతు, మెడ, పొట్ట, కుడిచేతిపై ఇష్టానుసారంగా పొడిచాడు. అనూష కేకలు వేయడంతో పక్కగదిలో ఉన్న అత్త, కూతుళ్లు వచ్చి అడ్డుకున్నారు. చుట్టుపక్కలవారి సమాచారంతో 108 సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని ఆమెను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆత్మకూరు సీఐ సంతోష్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)