Breaking News

33 ఏళ్ల తర్వాత మళ్లీ ‘వ్యభిచారం’!

Published on Fri, 01/31/2025 - 12:25

నిజామాబాద్ జిల్లా: మూడు దశాబ్దాల క్రితం... దేశం మొత్తం ఆ ఊరి గురించే మాట్లాడుకుంది. అండర్‌ గ్రౌండ్‌లలో బంధించి మరీ అమ్మాయిలతో వ్యభిచారం చేయించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రజలు తిరగబడడంతో ఆ ముఠా ఊరు విడిచి పరారైంది. అయితే ఇప్పుడు మళ్లీ అదే ముఠా సంచారం ఆ ఊరిని ఆందోళనకు గురి చేస్తోంది. 

నందిపేటలో.. గ్రామస్తుల కృషితో అంతమైన వ్యభిచార వృత్తి మళ్లీ మొదలైంది. ఊరి జనం దాడి చేయడంతో పారిపోయిన వ్యభిచార గృహాల నిర్వాహకులు మళ్లీ అక్కడ అడుగుపెట్టారు. అయితే కూలీ పనులు చేసుకుని బతుకుతామని బతిమాలి.. తిరిగి పాత వ్యవహారాలనే వెలగబెడున్నారు. 

నందిపేట సమీపంలోని లక్కంపల్లి ప్రాంతంలో వీళ్లు స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నివాసాలు మళ్లీ వ్యభిచార కేంద్రాలుగా మారాయి. అమ్మాయిలను ఎక్కడి నుంచో తీసుకువచ్చి బలవంతంగా ఈ రొంపిలోకి దింపుతున్నారు. ఐదు రోజుల క్రితం పోలీసులు దాడులు చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలతో పాటు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

33 ఏళ్ల కిందట ఏం జరిగిందంటే.. 
1992లో 13 ఏళ్ల బాలికను చిత్రహింసలు పెడుతూ వ్యభిచార రొంపిలోకి దింపడానికి ప్రయత్నించాగా ఆమె తప్పించుకుని ప్రజలను రక్షించాలని వేడుకుంది. దీంతో.. వ్యభిచార కూపాలపై గ్రామస్తులంతా దాడులు చేసి నిర్వాహకులను పరిగెత్తించారు. వారి ఇళ్లను తగులబెట్టి, నిర్వాహకులను తరిమి కొట్టారు. ఈ కూపంలో ఇరుక్కున్న అమ్మాయిలకు విముక్తి కల్పించారు. ఈ దాడుల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అండర్‌ గ్రౌండ్‌ గదుల్లో అమ్మాయిలను బంధించి వ్యభిచార కూపంలోకి దించేందుకు చిత్రహింసలు పెట్టేవారని, వినకపోతే చంపడానికి కూడా వెనుకాడబోయే వారు కాదని తేలింది. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించగా.. ఆంగ్ల, హిందీ ప్రముఖ పత్రికలు కూడా కథనాలు ప్రచురించాయి.

Videos

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)