Breaking News

ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థికి ఏకంగా రూ. 2.5 కోట్ల ఆఫర్‌, రికార్డ్‌

Published on Fri, 01/02/2026 - 14:52

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (IITH) విద్యార్థి 2025 ప్లేస్‌మెంట్ సీజన్‌లో రికార్డు ప్యాకేజీ సాధించాడు. చివరి సంవత్సరం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి నెదర్లాండ్స్‌కు చెందిన గ్లోబల్ ట్రేడింగ్ సంస్థలో  ఏకంగా రూ. 2.5 కోట్ల ప్యాకేజీని సాధించాడు.   2008లో ప్రారంభమైనప్పటి నన ఐఐటీ హైదరాబాద్‌ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యధికం కావడం విశేషం.

హైదరాబాద్‌లో పుట్టి పెరిగి, 7 నుండి 12వ తరగతి వరకు బెంగళూరులో చదువుకున్న 21 ఏళ్ల  విద్యార్థి ఎడ్వర్డ్ నేథన్ వర్గీస్ (Edward Nathan Varghese) భారీ వేతనంతో నెదర్లాండ్స్ ప్రముఖ సంస్థ 'ఆప్టివర్' (Optiver)లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరనున్నాడు. అంతకుముందు రెండు నెలల వేసవి ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన ఇద్దరు విద్యార్థులలో వర్గీస్‌ ఒకడు. ఇంటర్న్‌షిప్‌ తరువాత కంపెనీ ఆయనకు ఇచ్చిన ప్రీ రీప్లేస్‌మెంట్‌ ఆఫర్‌తోపాటు, కేవలం రెండు వారాల ట్రైనింగ్ తర్వాత ఒక ప్రాజెక్ట్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాడు.ఈ తర్వాత తుది ఆఫర్‌ను అందుకున్న ఏకైక వ్యక్తి. 

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం  ప్రకారం  విద్యాపరంగా, వర్గీస్ 2022లో JEE మెయిన్‌లో 1100 ఆల్ ఇండియా ర్యాంక్ (AIR), JEE అడ్వాన్స్‌డ్‌లో AIR 558 సాధించాడు. 2025లో కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT)కి కూడా హాజరయ్యాడు. 99.96 పర్సంటైల్ సాధించి 120వ ర్యాంక్‌ను సాధించాడు.ప్లేస్‌మెంట్స్‌తో పాటు, వర్గీస్ క్యాంపస్‌లో అనేక లీడర్‌షిప్‌ రోల్స్‌ పోషించాడు. అతని లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, అతను IIT హైదరాబాద్‌లోని ఆఫీస్ ఆఫ్ కెరీర్ సర్వీసెస్‌లో ఓవరాల్ హెడ్‌గా పనిచేశాడు, ఎనిమిది మంది విద్యార్థి నిర్వాహకులు, దాదాపు 250 మంది కోఆర్డినేటర్లకు నాయకత్వం వహించాడు. దీనికి ముందు, అతను దాదాపు 11 నెలల పాటు ఇంటర్న్‌షిప్ సెల్

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు 

ఇదీ చదవండి: ఐదు నెలల చిన్నారి ఉసురు తీసిన ‘పాలు’

కాగా  ఐఐటీ హైదరాబాద్ ప్లేస్‌మెంట్లలో సరికొత్త చరిత్ర రికార్డైంది. ఐఐటీహెచ్‌లోని మరో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి రూ. 1.1 కోట్ల ప్యాకేజీని పొందగా ఏడాది తరువాత ఈ రికార్డు స్థాయి ఆఫర్ రావడం విశేషం. 2017లో అత్యధిక ఆఫర్ రూ. కోటిగా ఉన్న క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌ ఈ బెంచ్‌మార్క్‌ను దాటింది. మొత్తంమీద, 2025 ప్లేస్‌మెంట్ సీజన్‌లో ఇన్‌స్టిట్యూట్‌లో సగటు ప్యాకేజీలు దాదాపు 75శాతం పెరిగాయి, 2024లో రూ. 20.8 లక్షల నుండి ఈ సంవత్సరం మొదటి దశ ప్లేస్‌మెంట్‌లలో రూ. 36.2 లక్షలకు చేరుకున్నాయి. ఐఐటీహెచ్‌లోని విద్యార్థులు 24 అంతర్జాతీయ ఆఫర్‌లను పొందారు.

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)