Breaking News

మెజార్టీ నిందితులకు భూముల్లేవు

Published on Thu, 11/14/2024 - 00:53

వికారాబాద్‌: తమ వద్ద పక్కా సాక్ష్యాధారాలు ఉన్నందునే లగచర్ల ఘటనలో పట్నం నరేందర్‌రెడ్డిని ఏ–1గా చేర్చి అరెస్టు చేశామని ఐజీ సత్యనారాయణ చెప్పారు. బుధవారం కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌తో భేటీ అయిన ఆయన, ఆ తర్వాత ఎస్పీ నారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. లగచర్ల ఘటనకు సంబంధించి నరేందర్‌రెడ్డితో పాటు మరో 20 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. 

కోర్టులో హాజరుపర్చిన సమయంలో జరిగిన వాదనల సందర్భంగా సాంకేతిక ఆధారాలతో పాటు ఇతర ప్రాథమిక ఆధారాలు సమరి్పంచామని వెల్లడించారు. కలెక్టర్‌తో పాటు అధికారులపై జరిగిన దాడిపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని చెప్పారు. ముందుగా 57 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, ప్రశ్నించిన తర్వాత ఘటనతో సంబంధం లేని 40 మందిని విడుదల చేశామని చెప్పారు. 

దాడిలో పాల్గొన్నవారిలో 42 మందిని గుర్తించామని, అయితే ఇందులో 19 మంది ఏ సంబంధం లేకుండానే దాడిలో పాల్గొన్నారని వెల్లడించారు. మెజార్టీ నిందితులకు అక్కడ భూములు లేవని, ముందస్తు కుట్రలో భాగంగానే ఈ ఘటన జరిగినట్టుగా ఆధారాలున్నాయని ఐజీ చెప్పారు. మిగిలిన నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామన్నారు. తొలుత ఏ–1గా సురేశ్‌ ఉండగా దర్యాప్తు తర్వాత లభ్యమైన సాక్ష్యాధారాలతో నరేందర్‌రెడ్డిని ఏ–1గా చేర్చామని వివరించారు. 

దాడిలో సురేష్, మహేశ్, దేవదాస్, గోపాల్‌నాయక్, విఠల్, రాజు, విజయ్‌ ప్రధాన భూమిక పోషించారన్నారు. ఈ కేసులో ఇంకా చాలామందిని గుర్తించాల్సి ఉందన్నారు. గతంలో సురేష్ పై కేసులున్నాయని, రేప్‌ కేస్‌ ఉంటే మేనేజ్‌ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. తదుపరి దర్యాప్తులో అన్ని విషయాలను గుర్తిస్తామని పేర్కొన్నారు.  

రిమాండ్‌కు తరలించింది వీరినే..
ఏ1 పట్నం నరేందర్‌రెడ్డి, ఏ 21 బోగమోని మహేశ్, ఏ 22 బ్యాగరి విశాల్, ఏ 24 నీరటి సాయిలు, ఏ 27 నీరటి రమేశ్‌ (వీరిని బుధవారం అరె స్టు చేశారు), ఏ 3 ఎ.శివకుమార్, ఏ 11 మైలారం విష్ణువర్ధన్‌రెడ్డి, ఏ 14 హీర్యానాయక్, ఏ 15 పతీవత్‌ శ్రీను, ఏ 16 పతీవత్‌ ప్రవీణ్, ఏ 17 పతీవత్‌ వినోద్, ఏ 18 రాథోడ్‌ వినోద్, ఏ 19 జర్పాల హీర్యానాయక్, ఏ 20 బాస్యానాయక్, ఏ 23 బ్యా గరి యాదయ్య, ఏ 25 దోరేమోని రమేష్, ఏ 26 కావ లి రాఘవేందర్, ఏ 28 లక్ష్మయ్య, ఏ29 నీలి రవి, ఏ 30 శ్రీశైలం, ఏ 31 బాలకిష్టయ్య (వీరిని మంగళవారం రాత్రి అరెస్టు చేశారు). 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)