Breaking News

హెయిర్‌.. కేర్‌..! బట్టతలను దాటి విస్తరించిన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌!

Published on Fri, 08/09/2024 - 09:28

సాక్షి, సిటీబ్యూరో: చిన్న వయస్సులోనే జుట్టు రాలడం, బట్టతల మాత్రమే కాదు.. ఇప్పుడు శరీరంలో పలు అవసరమైన చోట్ల కేశాలను కోల్పోవడం/లేకపోవడం కూడా సమస్యలుగానే భావిస్తున్నారు. ఆధునికుల్లో సౌందర్య పోషణ పట్ల పెరిగిన ప్రాముఖ్యత నేపథ్యంలో అవసరమైన చోట కేశాల లేమి సమస్యలకు హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను అనేకమంది పరిష్కారంగా ఎంచుకుంటున్నారు.

ప్రస్తుతం హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సేవలను పొందుతున్న వినియోగదారుల్లో 25–45 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువ. ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో ఈ మార్కెట్‌ 25–30శాతం వార్షిక వృద్ధి నమోదు చేస్తోంది. బట్టతలకు మాత్రమే కాకుండా కను»ొమలు, మీసాలు, గెడ్డం కోసం కూడా మగవారు అలాగే నుదుటి భాగంలో జుట్టు పలచబడటం (ఫిమేల్‌ ప్యాటర్న్‌ బాల్డ్‌నెస్‌) వంటి కారణాలతో మహిళలు ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను ఆశ్రయిస్తుండటంతో ఈ మార్కెట్‌ రోజురోజుకూ విస్తరిస్తోంది.

యూనిట్‌ వారీగా వ్యయం..
ఒకచోట నుంచి హెయిర్‌ స్ట్రిప్‌ కట్‌ చేసి చేసే ఎఫ్‌యుటి, స్ట్రిప్‌తో సంబంధం లేకుండా చేసేది ఎఫ్‌యుఇ పేరిట రెండు రకాల ట్రాన్స్‌ప్లాంటేషన్‌ పద్ధతులున్నాయి. కేశాలనేవి ఒకటిగా కాకుండా 3, 4 చొప్పున మొలుస్తాయి కాబట్టి వాటిని ఫాలిక్యులర్‌ యూనిట్‌గా పిలుస్తారు. ఒక్కో యూనిట్‌ను పర్మనెంట్‌ హెయిర్‌ ఉన్న చోట నుంచి తీసి అవసరమైన చోట అమర్చడానికి యూనిట్‌కు రూ.50 నుంచి రూ70 వరకూ వ్యయం అవుతుంది. ఈ లెక్కన చూసుకుంటే బట్టతల సమస్య పరిష్కారానికి కనీసం రూ.70వేల నుంచి రూ.లక్ష వరకూ ఖర్చుపెట్టాలి. కను»ొమలు తదితర చిన్నచిన్న ట్రాన్స్‌ప్లాంటేషన్‌ తక్కువ వ్యయంతో రూ.10, రూ.15వేల వ్యయంతో గంట, రెండు గంటల్లోనే పూర్తవుతుంది. అయితే తలభాగం మీద పూర్తిస్థాయిలో చేయాలంటే ఒక పూట నుంచి ఒక రోజు మొత్తం క్లినిక్‌లో ఉండాల్సి రావొచ్చు. ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అనంతరం కొంత కాలం అధిక టెంపరేచర్‌కు గురికాకుండా జాగ్రత్తపడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.  

అర్హత లేమితో అనర్థాలు...
తక్కువ రెమ్యునరేషన్‌తో సరిపుచ్చడానికి.. పలు క్లినిక్‌లు అర్హత లేని వ్యక్తుల ఆధ్వర్యంలో శస్త్రచికిత్సలు చేస్తున్నాయి. దీంతో శరీరంపై మచ్చలు పడటం, బేసి వెంట్రుకలు, జుట్టు అపసవ్యంగా పెరగడం దగ్గర నుంచీ తీవ్రమైన ఇన్‌ఫెక్షన్, జుట్టురాలడం వరకు ఏ పరిస్థితినైనా ఎదుర్కోవాల్సి రావొచ్చు. పెరుగుతున్న డిమాండ్‌ నేపథ్యంలో డెర్మటాలజిస్ట్‌లకు సైతం అత్యవసరంగా శిక్షణ ఇస్తున్నారు. వీటన్నింటినీ పరిశీలించిన అనంతరం సరైన నిపుణుల పర్యవేక్షణలో జరిగే చికిత్సలు ఖచి్చతంగా సురక్షితమే.

అరకొర శిక్షణతో.. నో..
హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వంటి క్లిష్టమైన సౌందర్య ప్రక్రియలను నిర్వహించడానికి యూట్యూబ్‌ లేదా ఇతర ప్లాట్‌ ఫారమ్‌లలో శిక్షణ వీడియోలను చూస్తే సరిపోదని జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) తేల్చి చెప్పింది. సర్జికల్‌ అసిస్టెంట్‌/టెక్నీíÙయన్లు (రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌) పర్యవేక్షణలో ఇవి చేయాలని సూచించింది. సౌందర్య ప్రక్రియలేవీ అత్యవసర శస్త్రచికిత్స కిందకురావు. శిక్షణ లేని వ్యక్తి చేయడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.

వైద్యంతో పరిష్కారం కాకపోతేనే..
వంశపారంపర్యంగా వచ్చే బట్టతల విషయంలో ఎలా ఉన్నా మిగిలిన చోట్ల ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు వెళ్లే ముందు తప్పకుండా వైద్య పరమైన పరిష్కారం అన్వేíÙంచాలి.  ఉదాహరణకు కను»ొమ్మలు కోల్పోతే..  అల్ట్రా వయెలెంట్‌ లైట్‌ వినియోగించి మాగి్నఫైయింగ్‌ లెన్స్‌లను వినియోగించి దానికి కారణాన్ని గుర్తించాలి. చికిత్సకు అవకాశం ఉంటే చేయాలి. లేని పక్షంలోనే ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఎంచుకోవాలి. అవకాశం ఉంటే  కొన్ని మందులు అప్లై చేసి చూస్తాం. స్టిరాయిడ్‌ క్రీమ్స్‌ కూడా వినియోగిస్తాం.. ఎల్‌ఎల్‌ ఎల్‌టి, లో లెవల్‌ లోజర్‌ థెరపీతో కూడా వెంట్రుకలు పెరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనా.. సమస్యను సరైన విధంగా నిర్ధారించి అవసరం మేరకు చికిత్స చేసే అర్హత కలిగిన వైద్యుడి దగ్గరే చేయించుకోవాలి. లేకపోతే ఇతరత్రా ఆరోగ్య సమస్యలకూ కారణం కావొచ్చు.


– డా.జాన్‌ వాట్స్, డెర్మటాలజిస్ట్, సీనియర్‌ హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)