Breaking News

ఏసీబీ వలలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌

Published on Thu, 05/29/2025 - 08:16

కవాడిగూడ: ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.1.25 లక్షలు డిమాండ్‌ చేసి అడ్వాన్స్‌గా రూ. 25 వేలు లంచం తీసుకుంటున్న ఓ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీటీ రేంజ్‌– 2 ఏసీబీ డీఎస్పీ 
గంగసాని శ్రీధర్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సీతాఫల్‌మండీ ప్రాంతానికి చెందిన రామకృష్ణ ఓ క్యాంటీన్‌లో పని చేసేవాడు. అతడి కుటుంబ సభ్యుల్లో ఒకరు మృతి చెందడంతో ఆమె పేరున తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించేందుకు బ్యాంక్‌ అధికారులు ఫ్యామిలీ సర్టిఫికెట్‌ కావాలని సూచించారు. 

దీంతో అతను ఫ్యామిలీ సరి్టఫికెట్‌ కోసం ముషీరాబాద్‌ తహసీల్ధార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న స్పెషల్‌ ఆర్‌ఐ భూపాల మహేష్‌ ను సంప్రదించాడు. ఇందుకు అతను రూ.1.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. అయితే తాను క్యాంటిన్‌లో పనిచేస్తున్నానని అంత ఇచ్చుకోలేనని చెప్పినా  ఆర్‌ఐ వినిపించుకోకుండా రూ.1.10 లక్షలు ఇస్తేనే ఫ్యామిలీ సరి్టఫికెట్‌ ఇస్తానని చెప్పాడు. దీంతో రామకృష్ణ నాలుగు రోజుల క్రితం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. 

దీంతో రంగంలోకి దిగిన సిటీ రేంజ్‌ 2 ఏసీపీ, డీఎస్పీ శ్రీధర్‌ ఆధ్వర్యంలో బుధవారం లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని ముషీరాబాద్‌ తహసీల్ధార్‌ కార్యాలయంలో ఆర్‌ఐ మహేష్‌ కు  రామకృష్ణకు రూ.25 వేల నగదు ఇస్తుండగా రెడ్‌ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. అతడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మహే‹Ùపై అవినీతి ఆరోపణలు ఉండటంతో ఇటీవల అతను జారీ చేసిన సరి్టఫికెట్లపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. కాగా మరో బృందం కొంపల్లిలోని మహేష్‌ నివాసంలోనూ సోదాలు నిర్వహించింది. ఈ దాడిలో ఏసీబీ సిఐలు గౌస్‌ అజాద్, జగన్‌మోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య 
సికింద్రాబాద్‌: రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్‌ కోటేశ్వర్‌రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. 3వ నెంబర్‌ ప్లాట్‌ఫామ్‌ ట్రాలీ పాత్‌ వే రైల్వే ట్రాక్‌ ప్రక్కన బుధవారం ఓ యువకుడి మృతదేహాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు సుమారు 25 ఏళ్ల యువకుడు రైలు పట్టాలపై తలపెట్టి ఆత్యహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. మృతుడి ఒంటిపై తెలుపు, నలుపు గల్ల చొక్కా, నీలిరంగు జీన్స్‌ ప్యాంటు ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.

 

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)