Breaking News

నేడు నెక్లెస్‌ రోడ్డులో ఎయిర్‌ షో !

Published on Sun, 12/08/2024 - 05:43

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు నెక్లెస్‌ రోడ్డు వద్ద వాయుసేనకు చెందిన 9 సూర్యకిరణ్‌ విమానాలతో ఎయిర్‌ షో నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్, రాష్ట్ర మంత్రులు, వీవీఐపీలు, వాయుసేన సీనియర్‌ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వాయుసేన గ్రూప్‌ కెప్టెన్‌ అజయ్‌ దాశరథి నేతృత్వంలో ఈ ప్రదర్శన జరగనుంది. అద్భుత వైమానిక విన్యాసాలు చేసే ప్రపంచంలోనే అత్యుత్తమ ఐదు బృందాల్లో ఒకటైన సూర్యకిరణ్‌ టీం హైదరాబాద్‌లో ప్రదర్శన నిర్వహిస్తుండటంతో ప్రజలు భారీగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లపై శనివారం సచివాలయంలో ఆమె సమీక్ష నిర్వహించారు. ఎయిర్‌ షో అనంతరం రాహుల్‌ సిప్లిగంజ్‌ మ్యూజికల్‌ కన్సర్ట్‌ నిర్వహిస్తున్నందున.. నెక్లెస్‌ రోడ్డు, పీవీ మార్గ్‌లో ప్రజల కోసం ఫుడ్‌ స్టాళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు సచివాలయంలో నిర్వహించే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి లక్ష మంది మహిళలు హాజరవుతారని సీఎస్‌ చెప్పారు.

అందుకోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సమీక్షలో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇలంబర్తి, సీడీఎంఏ శ్రీదేవి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేవారి కోసం నెక్లెస్‌ రోడ్, పీపుల్స్‌ ప్లాజా, గోశాల రోడ్, నిజాం కాలేజ్, పబ్లిక్‌ గార్డెన్స్‌ వద్ద పార్కింగ్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేశామని హైదరాబాద్‌ పోలీస్‌ అదనపు కమిషనర్‌ విక్రంజీత్‌ సింగ్‌ మాన్‌ తెలిపారు. కాగా, వాయుసేన గ్రూప్‌ కెప్టెన్‌ అజయ్‌ దాశరథి బృందం శనివారం సచివాలయంలో సీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి జ్ఞాపికను బహూకరించింది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి