Breaking News

సైబర్‌ కేసుల్లో తెలంగాణ @ 3

Published on Mon, 01/08/2024 - 04:37

సాక్షి, హైదరాబాద్‌ : సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలపై నమోదవుతున్న కేసుల్లో తెలంగాణ రాష్ట్రం మూడోస్థానంలో ఉండగా, మొదటి రెండు స్థానాల్లో ఢిల్లీ, హరియాణా ఉన్నాయి. 2023లో రాష్ట్రంలో సైబర్‌ నేరాలను పరిశీలిస్తే ప్రతి లక్ష మందికి 261 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇది మనం చెబుతున్న మాట కాదు ఐ4సీ (ఇండియన్‌ సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌) సీఈఓ రాజేశ్‌కుమార్‌ ఇటీవల వెల్లడించిన 2023 వార్షిక నివేదికలో పొందుపరిచారు.

ఇంకా అనేక ఆసక్తికర అంశాలూ ఆ నివేదికలో ఉన్నాయి. సైబర్‌ నేరాలపై ప్రజల్లోనూ అవగాహన పెరుగుతోంది. ఈ నేరాలపై 1930 టోల్‌ఫ్రీ నంబరుకు రోజుకు సరాసరిన 50వేల ఫోన్‌కాల్స్‌ వచ్చినట్టు ఐ4సీ నివేదిక తెలిపింది. 2023 సంవత్సరంలో ఎన్‌సీఆర్‌పీ( నేషనల్‌ సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌)కి 15,56,176 ఫిర్యాదులు అందాయి. ఎన్‌సీఆర్‌పీకి సైబర్‌ నేరాలపై దేశవ్యాప్తంగా రోజుకు సరాసరిన 5వేల ఫిర్యాదులు వస్తున్నాయి. 

దేశవ్యాప్తంగా 2023లో అత్యధికంగా నమోదైన సైబర్‌ నేరాలు 
♦ కేవైసీ అప్‌డేషన్‌ మోసాలు, కస్టమర్‌ కేర్‌ నంబర్ల పేరిట మోసాలు 35%
♦  సెక్స్‌టార్షన్‌ స్కామ్‌లు 24%
♦  ఆన్‌లైన్‌ బ్యాంకింగ్, క్యూఆర్‌ కోడ్‌ మోసాలు 22%
♦  ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టం (ఏఈపీఎస్‌) మోసాలు 11%
♦  ఆండ్రాయిడ్‌ మొబైల్‌ మాల్వేర్‌ మోసాలు 8%

సైబర్‌ భద్రతకు అత్యంత ప్రాధాన్యం 
దేశప్రజలకు సైబర్‌ భ ద్రత కల్పించడం మా ప్రధాన లక్ష్యం. దీని కో సమే కేంద్రం ఐ4సీ ఏ ర్పాటు చేసింది. సైబర్‌ నేరాల గుర్తింపు, దర్యా ప్తు, సైబర్‌ నేరాల కట్టడి చేయడం కేంద్ర హోంశాఖ మాకు ఇచ్చిన ప్రధాన బాధ్యతలు. ఇందుకోసం మేం ప్రత్యేక వేదికగా పనిచేస్తున్నాం. సైబర్‌ భద్రత అనేది ఇప్పుడు జాతీయ భద్ర తగా మారిన నేపథ్యంలో ఐ4సీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదేశాల ప్రకారం బలోపేతం చేస్తూ వెళుతున్నాం. సైబర్‌నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం.   –  వార్షిక నివేదిక సందర్భంగా ఐ4సీ సీఈఓ రాజేశ్‌కుమార్‌

సైబర్‌క్రైం పోర్టల్‌ బ్లాక్‌ చేసినవి 
♦  2,95,461 ఫేక్‌ సిమ్‌ కార్డులు 
♦  46,000 ఐఈఎంఐ డివైజ్‌లు 
♦  595 మొబైల్‌ అప్లికేషన్స్‌
♦  2,810 ఫిషింగ్‌  వెబ్‌సైట్స్, యూఆర్‌ఎల్‌లు

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)