Breaking News

బొమ్మ బంద్‌.. ఇక ‘రుచి’ చూపిస్తా !: ఇమ్మడి రవి

Published on Thu, 12/04/2025 - 04:46

సాక్షి, హైదరాబాద్‌: ఐ బొమ్మ, బప్పం పేర్లతో వెబ్‌సైట్లను ఏర్పాటు చేసి, 21 వేల సినిమాలను పైరసీ చేసిన ఇమ్మంది రవి తన పంథా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ రెస్టారెంట్‌ ఏర్పాటు చేసి వినియోగదారులకు షడ్రుచుల ఆహార పదార్థాలను విక్రయించాలని యోచిస్తున్నాడు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల విచారణలో రవి ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. ఇమ్మంది రవిపై హైదరాబాద్‌లో మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. 

తొలుత ఓ కేసులో అరెస్టు చేసిన పోలీసులు కోర్టు అనుమతితో ఓసారి కస్టడీకి, మరోసారి అదనపు కస్టడీకి తీసుకున్నారు. ఆపై మరో కేసులో అరెస్టు చేయడానికి అనుమతి కోరుతూ న్యాయస్థానంలో ప్రిజనర్స్‌ ట్రాన్సిట్‌ వారెంట్‌ కోసం పిటిషన్‌ వేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు రెండు కేసుల్లో ఈ తంతు పూర్తి చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మిగిలిన మూడు కేసుల్లోనూ ఇదే ప్రక్రియను అనుసరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలిసారి అరెస్టు చేసిన నాటికి, ఇప్పటికి అతడిలో ఎంతో మార్పు కనిపిస్తోందని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెప్తున్నారు. 

తమకు చిక్కినప్పుడు సినిమా టికెట్ల రేట్లు, హీరోల రెమ్యూనరేషన్ల విషయాలు మాట్లాడి, తన పనిని సమర్థించుకున్నాడని, ప్రస్తుతం పైరసీ సినిమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెపుతున్నాడని అధికారులు తెలిపారు. బతుకు తెరువు కోసం హైదరాబాద్‌ లేదా తన స్వస్థలమైన విశాఖపట్నంలో రెస్టారెంట్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు పోలీసులతో చెప్పాడు. 

అలాగే తన తప్పు తెలుసుకున్న రవి తన తండ్రి చిన అప్పారావు వద్దకూ వెళ్లాలని భావిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. భార్య నుంచి దూరమైన నాటి నుంచి అతడు ఒంటరిగానే జీవిస్తున్నాడు. ప్రస్తుతం తాను ఇక్కడ, తండ్రి అక్కడ ఒంటరి జీవితం గడుపుతున్నామని విచారం వ్యక్తం చేస్తున్నాడు. అనారోగ్యంతో, తన తల్లి నుంచి దూరంగా బతుకుతున్న తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటానని పోలీసులకు తెలిపాడు.

నేడు కీలక విచారణ
సినీ పైరసీ కేసు నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే రెండు విడతలుగా.. ఎనిమిది రోజులుగా పోలీసులు రవిని కస్టోడియల్‌ విచారణ జరిపిన సంగతి తెలిసిందే. అయితే నాలుగు కేసుల్లో విచారణ జరిపేందుకు మరోసారి కస్టడీ కోరుతున్నారు. ఈ పిటిషన్‌ ఇవాళ కోర్టు ముందుకు రానుంది. దీని విచారణ తర్వాతే కోర్టు ఇమ్మడి రవి బెయిల్‌ పిటిషన్‌ను పరిశీలించనుంది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)