Breaking News

సీఆర్‌పీఎఫ్‌ బలగాలు వెళ్లాయి.. తిరిగి వచ్చాయి!

Published on Sun, 12/29/2024 - 06:07

నాగార్జునసాగర్‌: గత సంవత్సర కాలంగా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు భద్రతను పర్యవేక్షిస్తూ విధులు నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్‌ బలగాలు శనివారం ఉదయం విధుల నుంచి తప్పుకుని వెళ్లిపోయి.. తిరిగి సాయంత్రం విధుల్లో చేరాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2013 నవంబర్‌ 29న నాగార్జునసాగర్‌ డ్యాంపై ఆంధ్రా పోలీస్‌ బలగాలు సగం ప్రాజెక్టును స్వా«దీనంలోకి తీసుకున్నాయి. దీంతో కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆదేశాల మేరకు అదే సంవత్సరం డిసెంబర్‌ 3వ తేదీ నుంచి కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. సీఆర్‌పీఎఫ్‌ బలగాలు సాగర్‌ ప్రాజెక్టును తమ అ«దీనంలోకి తీసుకొని భద్రతా విధులు నిర్వహిస్తున్నాయి. సాగర్‌డ్యాంపై తెలంగాణ వైపు, ఆంధ్రా ప్రాంతంవైపు రెండు పక్కలా సీఆర్‌పీఎఫ్‌ దళాలు విధులు నిర్వహిస్తూ వచ్చాయి.

అయితే, అకస్మాత్తుగా శనివారం తెల్లవారుజామున తెలంగాణ వైపు ఉన్న సీఆర్‌పీఎఫ్‌ బలగాలు తమ విధులను ఉపసంహరించుకొని హిల్‌కాలనీలోని బాలవిహార్‌లోగల తమ క్యాంపులను ఖాళీ చేసి వెళ్లి పోయాయి. ఆంధ్రా వైపు ఉన్న సీఆర్‌పీఎఫ్‌ బలగాలు యథావిధిగానే ఉన్నాయి. దీంతో తెలంగాణవైపు ప్రధాన డ్యాంపై స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్‌పీఎఫ్‌) బలగాలు డ్యాంను తమ అ«దీనంలోకి తీసుకొని విధులు నిర్వహించాయి. శనివారం తెల్లవారుజామున వెళ్లిపోయిన సీఆర్‌పీఎఫ్‌ బలగాలు తిరిగి సాయంత్రానికి సాగర్‌లోని తమ క్యాంపులకు చేరుకొని నాగార్జునసాగర్‌ డ్యాం భద్రతా విధులలో చేరాయి.

ఆంధ్రా వైపు ఉన్న సీఆర్‌పీఎఫ్‌ బలగాలు అదేవిధంగా ఉండటంతో.. తెలంగాణ వైపు సీఆర్‌పీఎఫ్‌ బలగాలు తిరిగి సాగర్‌ ప్రాజెక్టు విధి నిర్వహణకు వచి్చనట్లుగా తెలుస్తోంది. సాగర్‌ ప్రాజెక్టు ఉన్నతాధికారులు ఎవరూ దీనిపై సమాధానం చెప్పడం లేదు. సాయంత్రం తిరిగి చార్జ్‌ తీసుకున్న సీఆర్‌పీఎఫ్‌ దళాల అసిస్టెంట్‌ కమాండర్‌ షహేర్‌ మాట్లాడుతూ శనివారం తెల్లవారుజామున విధులను ఉపసంహరించుకొని వెళ్లిపోయామని, తిరిగి ఉన్నతాధికారుల ఆదేశాలతో తెలంగాణ వైపు చార్జి తీసుకున్నట్లుగా తెలిపారు. సరైన ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)