Breaking News

రోడ్డునపడ్డ బతుకులు

Published on Wed, 12/31/2025 - 06:21

మొయినాబాద్‌: మొయినాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో ఓ రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌ మాటలు నమ్మి కొందరు అమాయక గిరిజనులు నిండా మునిగారు. వేరొకరి పట్టా భూమిలో ప్లాట్లు కొని నిర్మాణాలు చేపట్టగా మున్సిపల్‌ అధికారులు మంగళవారం తెల్లవారుజామున జేసీబీలతో నేలమట్టం చేశారు. దీంతో వారు రోడ్డున పడ్డారు. మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగళారం రెవెన్యూ 210, 211, 212 సర్వే నంబర్లలో ఉన్న 16 ఎకరాలను హరికిషన్, హర్ష అనే వ్యక్తులు 2019లో అక్రమంగా లేఅవుట్‌ వేయగా సంతోష్‌నాయక్‌ అనే మధ్యవర్తి 2020 నుంచి కొడంగల్, పరిగి, షాద్‌నగర్‌ ప్రాంతాలకు చెందిన ప్రాంతాలకు చెందిన 50 మంది గిరిజనులకు ప్లాట్లు విక్రయించాడు. సబ్‌రిజిస్ట్రార్‌ను మ్యానేజ్‌ చేసి గిరిజనులకు అక్రమార్కులు రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలుస్తోంది.

ప్లాట్లు కొన్న వారిలో పది మంది ఇళ్లు నిర్మించుకోగా విదేశాల నుంచి రెండేళ్ల క్రితం తిరిగి వచ్చిన జి.శ్రీనివాస్‌గౌడ్‌ అనే భూ యజమాని తన స్థలంలో అక్రమ నిర్మాణాలు వెలిశాయంటూ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం మున్సిపల్‌ అధికారులు పది ఇళ్లను నేలమట్టం చేసి 40 ప్లాట్ల ప్రహరీలను కూల్చేశారు. కళ్ల ముందే తమ కలల సౌధాలు శిథిలాలుగా మారడంతో గిరిజనులు గుండెలవిసేలా రోదించారు. మధ్యవర్తిని నమ్మి రూ. లక్షలు పెట్టి మోసపోయామని లబోదిబోమన్నారు. కనీసం ఇళ్లలోని సామగ్రిని తీసుకెళ్లేందుకు కూడా అధికారులు అవకాశం ఇవ్వలేదని వాపోయారు.

భూమి అమ్మి ప్లాటు కొన్నాం
షాద్‌నగర్‌ ప్రాంతంలో అర ఎకరం భూమి అమ్మి రెండేళ్ల క్రితం ఇక్కడ ప్లాటు కొని ఇల్లు కట్టుకొని ఉంటున్నాం. ఇంటికి కరెంటు మీటర్‌ కూడా ఇచ్చారు. మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూలగొట్టారు. సామాన్లన్నీ అందులోనే పోయాయి. ఇప్పుడు మేం ఎక్కడికి పోవాలి? – అంబు, బాధితురాలు

చావే దిక్కు
మా సొంతూరు కొడంగల్‌. అత్తాపూర్‌లో ఉంటున్నా. నా భర్త చనిపోయాడు. ఐదుగురు పిల్లలు ఉన్నారు. పనిచేసి పిల్లలను సాకుతున్నా. కొన్నేళ్ల కిందట 100 గజాల ప్లాటు కొన్నా. ఈ ప్లాటే ఆధారం అనుకున్నా. ఇప్పుడు నా గతేం కావాలి. నాకు, నా పిల్లలకు చావే దిక్కు. – ముడావత్‌ సోని, బాధితురాలు 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు