Breaking News

సికింద్రాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు

Published on Fri, 06/06/2025 - 07:10

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పరిధిలో ఇవాళ హైడ్రా కూల్చివేతలు జరిగాయి. శుక్రవారం వేకువజాము నుంచే బేగంపేట ప్యాట్నీ పరిధిలోని నాలా పరివాహక ప్రాంతంలో ఆక్రమణల తొలగించారు. కంట్మోనెంట్‌ బోర్డు పరిధిలో తొలిసారి హైడ్రా కూల్చివేతలు జరగడం ఇక్కడ విశేషం.

హైడ్రా కమిషనర్ రంగనాథ్, కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్ గురువారమే రసూల్‌పురా నాలాను పరిశీలించారు. ఆపై కూల్చివేతలకు వారు ఆదేశించడంతో సిబ్బంది రంగంలోకి దిగారు. హైడ్రా (Hydra) అధికారులు కంటోన్మెంట్‌ యంత్రాంగంతో కలిసి అక్రమ కట్టడాలను కూల్చివేశారు.. 

తాజా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌(Ranganath) మీడియాతో మాట్లాడారు. నగరంలోని నాలాలపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టినట్లు తెలిపారాయన. వచ్చే 4 నెలల పాటు ఈ అంశంపైనే దృష్టి పెడుతున్నట్లు, వరదనీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. నాలా, నీటి వనరుల ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నాలాలపై అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను తొలగిస్తామని.. పేదల నిర్మాణాల అంశాన్ని మాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రంగనాథ్‌ చెప్పారు. 

హైడ్రా (HYDRA) అంటే హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ 🚜💥అనే ప్రత్యేక సంస్థ. ఇది హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను తొలగించడం, చెరువులను రక్షించడం, నగరాన్ని వరదల నుంచి కాపాడడం వంటి పనులు చేస్తుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరాన్ని ఆక్రమణల నుంచి కాపాడేందుకు ఇప్పటికే వందల సంఖ్యలో కట్టడాలను కూల్చేసింది. మరోవైపు ఇది రాజకీయంగా కూడా హాట్ టాపిక్ అయ్యింది. 

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో హైడ్రా కూల్చివేతలు

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)