Breaking News

కోహెడలో హైడ్రా పంజా

Published on Mon, 02/10/2025 - 11:25

సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కోహెడలో హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) ఆదివారం పంజా విసిరింది. అక్కడి అనేక ప్రాంతాల్లో వెలసిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చేశారు. సర్వే నంబర్‌ 951, 952ల్లోని గ్రామపంచాయతీ లేఔట్‌లో తమ ప్లాట్లను సమ్మిరెడ్డి బాల్‌రెడ్డి అనే వ్యక్తి ఆక్రమించారని, రహదారులు లేకుండా అడ్డుగోడలుగా కట్టారని రాధే ధామం లే ఔట్‌ ప్లాట్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో పాటు పలువురు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అధికారులు పలు పత్రాలను పరిశీలించారు. 

1986లో భూ యజమానులు కె.రాములు, పెద్దయ్య, ఈసయ్య గ్రామ పంచాయతీ లేఔట్‌ వేసినట్టు నిర్ధారించారు. సమ్మిరెడ్డి బాల్‌రెడ్డి ఆ భూమిని స్వా«దీనం చేసుకుని, ఫాం హౌస్‌ నిర్మించడంతో పాటు లే ఔట్‌లోని పలు ప్లాట్లను సొంతం చేసుకుంటూ అంతర్గత రహదారులను బ్లాక్‌  చేసినట్టు వెల్లడైంది. దీంతో అన్ని పత్రాలతో తమ కార్యాలయంలో హాజరు కావాలని ఇరుపక్షాలకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. శనివారం వారు హాజరు కాగా రెవెన్యూ, మున్సిపల్‌ అధికారుల సమక్షంలో క్షుణ్ణంగా పరిశీలించింది. ఫామ్‌హౌస్, షెడ్, కాంపౌండ్‌ వాల్, ఫెన్సింగ్‌ నిర్మాణాలకు ఎలాంటి  అనుమతులు లేవంటూ తుర్కయాంజాల్‌ మున్సిపల్‌ అధికారుల స్పష్టం చేశారు.

 ప్లాట్లను తమకు అమ్మిన తర్వాత సమ్మిరెడ్డి ఈ భూమిని తాను కొన్నట్టు రికార్డులు సృష్టించారని ప్లాట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధుల ఆరోపించారు. హైడ్రా ఇరుపక్షాలతో పాటు రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులను విచారించి సమ్మిరెడ్డి బాల్‌రెడ్డి నిరి్మంచిన ఫాంహౌస్‌తో పాటు ప్రహరీ, ఫెన్సింగ్‌ కూల్చివేతకు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఆదివారం భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను కూల్చేశారు. ఈ సందర్భంగా సుమారు 170 ప్లాట్లకు కబ్జాదారుల నుంచి అధికారులు విముక్తి కల్పించారు. వీటిలో పార్కులు, క్రీడా స్థలాలు ఉన్నాయి.

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)