రాజేంద్రనగర్‌లో కబ్జాలు..

Published on Wed, 10/15/2025 - 10:34

సాక్షి, హైదరాబాద్‌: అక్రమ నిర్మాణాలను, భూ ఆక్రమణల నిరోధానికి ఏర్పాటైన హైడ్రా మరోసారి కొరడా ఝళిపించింది. నగరంలోని రాజేంద్రనగర్‌ (Rajendranagar) పరిధిలో బుధవారం దాడులు నిర్వహించిన హైడ్రా రూ.139 కోట్ల విలువైన భూములను అక్రమార్కుల బారి నుంచి కాపాడింది. హైడ్రా అధికారులు బుల్డోజర్లు, జేసీబీలతో  అక్రమ నిర్మాణాలను, ఆక్రమణలను తొలగిస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అధికారులు తదనుగుణంగా చర్యలు చేపట్టారు. 

వివరాలు ఇలా ఉన్నాయి.. రాజేంద్రనగర్‌ పరిధిలోని బుద్వేల్, ఉప్పరపల్లి (upparpalli) గ్రామాల్లో ఉన్న ‘జన చైతన్య ఫేస్-1, ఫేస్-2’ నిర్మాణాల్లో నాలుగు పార్కుల భూమి ఆక్రమణలకు గురయ్యాయి. ఈ విషయమై స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపిన హైడ్రా అధికారులు.. కబ్జాలను ధ్రువీకరించుకున్నారు.  బుధవారం నాటి చర్యలతో ఆక్రమణలో ఉన్న సుమారు 19,878 గజాల పార్కు స్థలం మళ్లీ ప్రభుత్వం స్వాధీనమైంది. దీని విలువ దాదాపు రూ.139 కోట్లు ఉండవచ్చునని అంచనా.

 

బుధవారం ఉదయం ఉప్పరపల్లికి చేరుకున్న అధికారులు వేర్వేరు చోట్ల ఉన్న ఆక్రమిత భూముల్లోకి బుల్డోజర్లు, జేసీబీలు నడిపించారు. ఒక్కో ఆక్రమిత ప్రాంతం విస్తీర్ణం 500 నుంచి 3000 గజాల వరకు ఉంది. వీటిల్లోని చెట్లను తొలగించిన అధికారులు స్థలం చుట్టూ ఫెన్సింగ్ పనులు చేపట్టారు. ప్రభుత్వ భూమి అన్న హోర్డింగ్స్‌ ఏర్పాటు చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)