కూకట్‌పల్లిలో హైడ్రా.. బీఆర్‌ఎస్‌ నేత అక్రమ నిర్మాణాలు కూల్చివేత

Published on Sun, 09/22/2024 - 07:46

సాక్షి, కూకట్‌పల్లి: హైదరాబాద్‌లోకి కూకట్‌పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో కూకట్‌పల్లిలో చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తోంది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి.

కూకట్‌పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. నల్లచెరువును ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తోంది. నల్లచెరువు విస్తీర్ణం 27 ఎకరాలు ఉండగా.. 14 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు అధికారులు గుర్తించారు.  నల్లచెరువుపై సర్వే చేశారు. ఇందులో ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో 7 ఎకరాలు ఆక్రమణకు గురైంది. బఫర్‌జోన్‌లోని 4 ఎకరాల్లో 50కిపైగా పక్కా భవనాలు, అపార్టుమెంట్లు నిర్మించారు. ఎఫ్‌టీఎల్‌లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. 

కూల్చివేతల సందర్భంగా బాధితుల ఆవేదన.. కన్నీటిపర్యంతం

 

నివాసం ఉన్న భవనాలను మినహాయించి చెరువు ఆక్రమించి నిర్మించిన 16 షెడ్ల యజమానులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం, ఆదివారం తెల్లవారుజామునే హైడ్రా అధికారులు, పోలీసులు కూకట్‌పల్లి చేరుకున్నారు. చెరువు పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతల కార్యక్రమం జరుగుతోంది. అలాగే, అమీన్‌పూర్‌ పరిధిలోనూ హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది.

 ఈ నిర్మాణాలు ప్రముఖ బీఆర్ఎస్ నేత, బిల్డర్‌ చంద్రశేఖర్‌ నిర్మించారని గుర్తింపు. ఈ సందర్బంగా ఆయనను లోపలికి అనుమతించని అధికారులు. ఈ క్రమంలో చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. కోర్టు నోటీసులు ఉన్నా పట్టింపు లేదా? అని ప్రశ్నించారు. కనీసం మా సామాగ్రిని అయినా తెచ్చుకోనివ్వండి అంటూ కొనుగోలుదారులు ప్రాధేయపడుతున్నారు. మరోవైపు.. కూల్చివేతల సందర్భంగా అధికారులు మీడియాను అనుమతించలేదు. 

 

ఇది కూడా చదవండి: కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్‌

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)