Breaking News

హైడ్రా కూల్చివేతలు.. బోడుప్పల్‌లో కబ్జాలు..

Published on Thu, 05/22/2025 - 09:27

సాక్షి, మేడ్చల్‌: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

వివరాల ప్రకారం.. పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్‌లో స్మశాన వాటికల్లోని కొంత భూమిని కొందరు ఆక్రమించారు. అక్కడ అక్రమ నిర్మాణాలను చేపట్టారు. సర్వే నంబర్లు 1, 12లోని స్మశాన వాటికల్లోని భూములను కబ్జా చేసి కబ్జాదారులు వాటని విక్రయిస్తున్నారు. గత రెండేళ్లుగా కబ్జాలు జరుగుతున్నాయి. దీంతో, స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అనంతరం, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ బుధవారం మధ్యాహ్నం బోడుప్పల్, పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో పర్యటించారు. అక్రమ నిర్మాణాలు, కబ్జాలు జరిగినట్టు గుర్తించారు.

ఈ నేపథ్యంలో అక్కడ అక్రమ నిర్మాణాలను తొలగస్తామని రంగనాథ్‌.. స్థానికులకు హామీ ఇచ్చారు. గురువారం ఉదయమే హైడ్రా అధికారులు అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై హైడ్రా స్పందించడంతో​ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, అంతకుముందు, బుధవారం ఉదయం మేడిపల్లిలోని సేజ్ స్కూల్లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)