Breaking News

HYDRA: నేలకొరిగిన అక్రమాలు

Published on Mon, 08/19/2024 - 07:16

మణికొండ/మొయినాబాద్‌: గండిపేట చెరువు ఆక్రమణల చెర వీడుతోంది. ఈ చెరువుకు ఆనుకుని వెలసిన బడాబాబుల నిర్మాణాలను ఎట్టకేలకు తొలగించేందుకు హైడ్రా అధికారులు ఆదివారం శ్రీకారం చుట్టారు. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో వెలసిన నిర్మాణాల తొలగింపునకు చర్యలు చేపట్టారు. రెండు బృందాలుగా ఏర్పడిన హైడ్రా సిబ్బంది నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్‌లో వెలసిన అక్రమ నిర్మాణాలను కూలి్చవేశారు. వీటిలో ఒకటి ప్రముఖ న్యాయవాదికి చెందినది కాగా.. మరొకటి కేంద్ర మాజీ మంత్రి బంధువులకు సంబంధించింది కావడం గమనార్హం. అలాగే.. శంకర్‌పల్లి రోడ్డు సమీపంలో నిర్మాణంలో ఉన్న  ఓ రెస్టారెంట్‌ను నేలమట్టం చేశారు. అదే రోడ్డులో ఖానాపూర్‌ దాటిన తర్వాత ఉన్న ఓరో స్పోర్ట్స్‌ విలేజ్‌లోని కొంత భాగాన్ని కూల్చివేశారు.  

భారీ బందోబస్తు మధ్య.. 
నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్‌లో హైడ్రా ఆర్‌ఎఫ్‌ఓ పాపారావు ఆధ్వర్యంలో కూలి్చవేతలు కొనసాగాయి. ఈ సందర్భంగా నార్సింగి ఏసీపీ రమణగౌడ్‌ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నార్సింగి మున్సిపల్‌ కమిషనర్‌ టి. కృష్ణమోహన్‌రెడ్డి, టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ శ్రీధర్‌గౌడ్‌ పనులను పర్యవేక్షించారు. 

మొయినాబాద్‌ మండలంలోని అప్పోజీగూడ, చిలుకూరు గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న వెస్టిసైడ్‌ వెంచర్‌లో గండిపేట చెరువు ఎఫ్‌టీఎల్‌ను ఆక్రమించి చేపట్టిన భారీ నిర్మాణాలను హైడ్రా అధికారులు గుర్తించారు. మల్లికార్జున్, చరణ్, జలమండలి డీజీఎం నరహరి, జలమండలి విజిలెన్స్‌ అధికారి డీకే లక్షి్మరెడ్డి, స్థానిక ఇన్‌స్పెక్టర్‌ పవన్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తుతో వెస్టిసైడ్‌ వెంచర్‌లోని భవనాలను కూలి్చవేశారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మించిన క్రికెట్‌ మైదానాన్ని ధ్వంసం చేశా రు. చెరువు చుట్టూ వందలాది అక్రమ నిర్మాణాలు ఉండటంతో అయిదు రోజుల పాటు కూలి్చవేతలు చేపట్టనున్నట్లు సమాచారం. 

చెరువును పూడ్చి.. 
గండిపేట చెరువును ఆనుకుని ఎకరం, రెండెకరాల భూములు కొనుగోలు చేసిన బడాబాబులు మరింత స్థలాన్ని ఆక్రమించి ఫాంహౌస్‌లు నిర్మించారు. ఖానాపూర్, గండిపేట, మంచిరేవుల, హిమాయత్‌నగర్, చిలుకూరు, అప్పోజీగూడ, చందానగర్, చిన్నమంగళారం, జన్వా డ, మిర్జాగూడ, మియాఖాన్‌ గడ్డ తదితర గ్రా మాల పరిధిలో వందల సంఖ్యలో ఆక్రమణలు జరిగాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. 

గండిపేట పరీవాహక ప్రాంతాల్లోని ఆక్రమణలను పూర్తిగా తొలగించాలని కోరుతున్నారు. ఇదే తరహాలో హిమాయత్‌ సాగర్‌ పరిసరాల పరిధిలో వెలసిన నిర్మాణాలపై సైతం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)