Breaking News

హైద‌రాబాద్ జూపార్కు ఎంట్రీ టికెట్‌ ధరల పెంపు

Published on Wed, 02/26/2025 - 17:51

హైద‌రాబాద్ న‌గ‌ర వాసుల‌కు అల‌ర్ట్. సెల‌వు రోజున స‌ర‌దాగా పిల్ల‌ల‌ను తీసుకుని జూపార్కుకు వెళ్లాల‌ని అనుకుంటున్నారా? అయితే మీ జేబు బ‌రువు పెర‌గాల్సిందే. ఎందుకంటే జూపార్కు ఎంట్రీ టికెట్‌ రేట్లు భారీగా పెర‌గ‌బోతున్నాయి. పెద్దల టికెట్ రేటు రూ. 30, పిల్ల‌ల‌కు 5 రూపాయలు పెంచారు.

హైద‌రాబాద్‌ నగరంలోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ (Nehru Zoological Park) ఎంట్రీ టికెట్‌ రేట్లను పెంచారు. జూ అండ్‌ పార్క్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ 13వ గవర్నింగ్‌ బాడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పెద్దలకు టికెట్‌ ధర రూ.100, చిన్నారులకు రూ.50కి పెంచారు. ఈ రేట్లు సందర్శకులకు మార్చి 1వ తేదీ (శనివారం) నుంచి అమలులోకి వస్తాయని జూ క్యూరేటర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇప్ప‌టివ‌ర‌కు సాధార‌ణ రోజుల్లో ఒక‌లా.. శ‌ని, ఆదివారాల‌తో పాటు సెల‌వురోజుల్లో మ‌రోలా టికెట్ రేట్లు ఉండేవి. ఇక నుంచి అన్నిరోజుల్లోనూ ఒకటే ధ‌ర‌లు ఉంటాయ‌ని జూ క్యూరేటర్‌ వెల్ల‌డించారు. ఎంట్రీ టికెట్ రేట్ల‌తో పాటు కెమెరా, బ్యాట‌రీ వెహిక‌ల్‌, టాయ్‌ట్రైన్‌, స‌ఫారీ పార్కు డ్రైవ్ రేట్లు కూడా పెంచిన‌ట్టు తెలిపారు.

చ‌ద‌వండి: రైలు టికెట్‌ ఇలా కొంటే క్యాష్‌బ్యాక్‌..

ప్ర‌స్తుతం సాధార‌ణ రోజుల్లో  పెద్ద‌ల‌కు రూ. 70, పిల్ల‌ల‌కు రూ.45 ప్రవేశ రుసుం వ‌సూలు చేస్తున్నారు. వీకెండ్‌, సెల‌వు దినాల్లో పెద్ద‌ల‌కు రూ. 80, పిల్ల‌ల‌కు రూ.55 తీసుకుంటున్నారు. మార్చి 1 నుంచి అన్నిరోజుల్లోనూ పెద్ద‌ల‌కు రూ.100, పిల్ల‌ల‌కు రూ.50 వ‌సూలు చేస్తారు. ఆన్‌లైన్‌లో కూడా టికెట్లు బుక్ చేసుకునే స‌దుపాయం ఉంది. పూర్తి వివ‌రాల‌కు nzptsfd.telangana.gov.in/home.do వెబ్‌సైట్ చూడొచ్చు.

ఉమెన్స్‌ డే రోజు ‘రన్‌ ఫర్‌ యాక్షన్‌–2025’ 
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మార్చి 8న హైద‌రాబాద్‌ నగర షీ–టీమ్స్‌ ‘రన్‌ ఫర్‌ యాక్షన్‌–2025’పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. పీవీ నర్సింహారావు మార్గ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో జరిగే ఈ 5కే, 2కే పరుగుకు సంబంధించిన పోస్టర్‌ను కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ మంగళవారం ఆవిష్కరించారు. వీటిలో పాల్గొనాలని భావించే వారు ( rfa.bebetter.run) వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేష‌న్‌ చేసుకోవాలని మహిళా భద్రత విభాగం డీసీపీ లావణ్య తెలిపారు. ‘మహిళల భద్రతకు అవసరమైన చర్యలు వేగవంతం చేయండి’అనే థీమ్‌తో ఈ రన్‌ నిర్వహిస్తున్నారు.  

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)