Breaking News

హైద‌రాబాద్‌ పాతబస్తీలో అతిపెద్ద ఫ్లై ఓవర్‌.. విశేషాలివే

Published on Fri, 11/29/2024 - 19:16

హైద‌రాబాద్‌ పాతబస్తీలో అతిపెద్ద ఫ్లై ఓవర్‌ ప్రారంభానికి సిద్ధమవుతోంది. జూపార్కు నుంచి ఆరాంఘర్‌ వరకు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్‌ పనులన్నీ ఈ నెల 30 వరకు పూర్తి చేసి డిసెంబర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి వస్తే.. ఆరాంఘర్, శాస్త్రీపురం, కాలాపత్తర్, దారుల్‌ ఉల్‌ ఉలూం, శివరాంపల్లి, హసన్‌నగర్‌ తదితర ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్‌ సమస్యలు తగ్గనున్నాయి. బెంగళూర్‌ జాతీయ రహదారితో పాటు రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే వారికి సౌకర్యంగా మారనుంది. ఇప్పటి వరకు బాటిల్‌ నెక్‌ రోడ్డుతో ఇబ్బందులకు గురైన స్థానిక బస్తీల ప్రజలతో పాటు దూర ప్రాంతాల వారికి ఈ ఫ్లై ఓవర్‌ ఎంతో అనుకూలంగా ఉంటుంది.

ఎస్‌ఆర్‌డీపీ కింద.. 
నగరంలో ఇప్పటి వరకు 2– 7 కిలో మీటర్ల పొడవుతో షేక్‌పేట్‌ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. 4.04 కిలో మీటర్ల అతి పెద్ద ఫ్లైఓవర్‌ పాతబస్తీలో నిర్మాణమైంది. వచ్చే నెల మొదటి వారంలో వాహనదారులకు దీనిని అందుబాటులోకి తీసుకురావడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు గ్రేటర్‌ కమిషనర్‌ కె.ఇలంబర్తితో పాటు హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, జలమండలి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మయాంక్, సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులు ఈ నెల 26న ఫ్లై ఓవర్‌ పనులను పరిశీలించారు. 

చ‌ద‌వండి: కాలిపోయిన క‌ల‌ల సౌధం.. రెండు రోజుల క్రితమే గృహ‌ప్ర‌వేశం.. అంత‌లోనే ఇలా

సర్వీస్‌ రోడ్లలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇంకా 17 కట్టడాలను తొలగించాల్సి ఉందని జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్‌ విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ దేవానంద్, ఎస్‌ఈ దత్తు పంతు తదితరులు కమిషనర్‌కు వివరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని చార్మినార్‌ జోనల్‌ కమిషనర్‌ వెంకన్నను కమిషనర్‌ ఆదేశించారు. 
 
2023 మార్చి నాటికే పూర్తి కావాల్సింది..  
జూ పార్కు నుంచి ఆరాంఘర్‌ వరకు రూ.736 కోట్లతో స్ట్రాటజిక్‌ రోడ్డు డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఎస్‌ఆర్‌డీపీ) కింద దాదాపు 4.04 కిలో మీటర్ల మేర ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని జీహెచ్‌ఎంసీ చేపట్టింది.  2021లో పనులు చేపట్టారు. 2023 మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉండగా.. నత్తనడకన సాగడంతో ఈ ఏడాది నవంబర్‌ వరకూ కొనసాగాయి. ఇంకా 2 డౌన్‌ ర్యాంపులతో పాటు 2 అప్‌ ర్యాంపులు పూర్తి కావాల్సి ఉంది. ఇందులో మొత్తం 163 ప్రాపర్టీలను స్వాధీనం చేసుకోవడానికి రూ.336 కోట్లు ఖర్చు చేయగా.. మిగిలిన నిధులతో ఆరు లేన్ల మేర ఫ్లైఓవర్‌ను నిర్మించారు.    

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)