Breaking News

యాదాద్రికి ఎంఎంటీఎస్‌

Published on Wed, 02/04/2026 - 07:13

సాక్షి, హైదరాబాద్‌: లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి రైలుమార్గం సుగమం కానుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రికి ఎంఎంటీఎస్‌ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు పనులు త్వరలో పట్టాలెక్కనున్నాయి. రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆరీ్వఎన్‌ఎల్‌) టెండర్లు దక్కించుకుంది. ఇప్పటికే రాయగిరి వరకు  భూసేకరణ పూర్తి కావడంతో  త్వరలో పనులను ప్రారంభించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారి ఒకరు తెలిపారు. రెండున్నరేళ్లలో  ప్రాజెక్టును పూర్తి చేసి ఎంఎంటీఎస్‌ రైళ్లను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైల్వేశాఖ సొంత నిధులతో రాయగిరి వరకు సుమారు  33 కి.మీ. నిర్మాణానికి రూ.430 కోట్లకు పైగా  వ్యయం కానున్నట్లు అంచనా. ఎంఎంటీఎస్‌  రైళ్లు వినియోగంలోకి వస్తే సికింద్రాబాద్‌ నుంచి చర్లపల్లి, ఘట్కేసర్‌ మీదుగా రాయగిరికి చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో యాదాద్రికి వెళ్లవచ్చు.  

నగర వాసులకు ఉపయుక్తం.. 
ప్రస్తుతం నగరవాసులు ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాల్లోనే  యాదాద్రికి రాకపోకలు సాగిస్తున్నారు. రైల్వే సదుపాయం  అందుబాటులో లేకపోవడంతో నగరవాసులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సైతం రోడ్డు మార్గంలోనే వెళుతున్నారు. అప్పట్లో యాదా ద్రి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే ఎంఎంటీఎస్‌ రెండో దశను పొడిగించాలని ప్రతి పాదించారు. ఈ మేరకు  2015లోనే  క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి ప్రణాళికలను సిద్ధం చేసినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్రమైన జాప్యం నెలకొంది. సుమారు  9 ఏళ్లపాటు పెండింగ్‌లో ఉంది. చివరకు రైల్వేశాఖ స్వయంగా నిర్మించాలని నిర్ణయించడంతో భూసేకరణతో పాటు, నిర్మాణ సంస్థల ఎంపిక తదితర పనుల్లో పురోగతి చోటుచేసుకుంది.  

అన్ని వైపుల నుంచీ..   
ఈ ప్రాజెక్టు పూర్తయితే  నగరంలో ఎక్కడి నుంచైనా నేరుగా యాదాద్రికి చేరుకొనే సదుపాయం లభిస్తుంది. పటాన్‌చెరు, తెల్లాపూర్, లింగంపల్లి, ఉందానగర్, మేడ్చల్‌ తదితర నగర శివారు ప్రాంతాల నుంచి కూడా  ఎంఎంటీఎస్‌ రైళ్లలో రాయగిరికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి మరో 4 కి.మీ రోడ్డు మార్గంలో యాద్రాద్రికి వెళ్లవచ్చు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)