Breaking News

సగం కూడా పూర్తికాలేదు.. సర్‌

Published on Tue, 07/21/2026 - 11:00

హైదరాబాద్‌: ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(సర్‌) ప్రక్రియలో భాగంగా గత నెల 25 నుంచి ఇంటింటికీ వెళ్లి బీఎల్‌ఓలు ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ చేశారు. ఆగస్టు 3 నాటికి పూరించిన ఫారాలను తిరిగి అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో భర్తీ చేసిన ఫారాలు బీఎల్‌ఓలకు సరిగా అందకపోవడంతో డిజిటలైజేషన్‌ మందగించింది.

మరికొంతమంది ఎక్కడో ఉండి దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. వారికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. స్వల్ప వ్యవధిలో సిటిజన్‌ సరీ్వస్‌ పోర్టల్‌ వేదికగా దరఖాస్తు చేసుకునే సదుపాయం కూడా కలి్పంచారు. మొబైల్‌ యాప్, వెబ్‌సైట్‌ ద్వారా ‘సర్‌’ఫారాలను పూర్తి చేయవచ్చు. ఓటరు జాబితాలో ఉన్న పేరు, ఆధార్‌ కార్డులో ఉన్న పేరు ఒకేలా ఉండాలి. సంప్రదించాల్సిన వెబ్‌సైట్‌ ఓటర్స్‌.ఈసీఐ.జీఓఈ.ఇన్‌.  

విదేశీయులకు కూడా అవకాశం.. 
ప్రవాస భారతీయులకు ఫర్‌ ఓవర్సీస్‌ ఓన్లీ అనే ఆప్షన్‌ కేటాయించారు. ఫోన్‌ నెంబర్, ఓటరు కార్డు అనుసంధానం కాకపోతే ఫారం–8 ద్వారా అనుసంధానం చేసుకోవచ్చు. ప్లేస్టోర్‌ లేదా యాపిల్‌ స్టోర్‌ నుంచి ఈసీఐఎన్‌ఈటీ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని కూడా ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. 

డిజిటలైజేషన్‌ వివరాలు... 
 ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో మొత్తం 245 పోలింగ్‌ బూత్‌లు ఉండగా 245 మంది బీఎల్‌ఓలు పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,93,667 మంది ఉండగా, ఇప్పటివరకు 40.32 శాతం డిజిటలీకరణ మాత్రమే పూర్తయింది. ఇప్పటివరకు 1,18,406 ఎన్యుమరేషన్‌ ఫారాలను డిజిటలైజ్‌ చేశారు. ఇంకో 1,68,513 ఫారాలు డిజిటలీకరణ చేయాల్సి ఉంది.  

 జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్‌ బూత్‌లు ఉండగా, 407 మంది బీఎల్‌ఓలు పనిచేస్తున్నారు. మొత్తం ఓటర్లు 40,6729 కాగా, ఇప్పటివరకు 1,55,405 (38.21 శాతం) డిజిటలైజేషన్‌ పూర్తిచేశారు. ఇంకా 2,34,735 (57.71 శాతం) ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలీకరణ పూర్తికావాల్సి ఉంది.  

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)