Breaking News

వియత్నాం టూర్‌కు ఫుల్‌ డిమాండ్‌.. హైదరాబాద్‌ నుంచే భారీ రద్దీ

Published on Wed, 07/08/2026 - 09:22

సాక్షి, హైదరాబాద్‌: నగర పర్యాటకులు హనోయ్‌లో విహరిస్తున్నారు. విదేశీ పర్యాటక ప్రాంతాల ఎంపికలో వియత్నాం పైవరుసలో నిలిచింది. హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి  ఏటా వివిధ దేశాలకు రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల్లో వియత్నాం మొదటి స్థానంలో ఉండడం విశేషం. నిరుడు హైదరాబాద్‌ నుంచి 35,776 మంది వియత్నాంలోని హనోయ్, హోచిమిన్‌ నగరాలకు రాకపోకలు సాగించగా, ఈ ఏడాది ఏకంగా  95,016 మంది వెళ్లారు.  నగరం నుంచి వియత్నాంకు నేరుగా విమాన సదుపాయాలు అందుబాటులో ఉండడం, సులభంగా వీసా లభించడం వంటి అంశాలు పర్యాటకులను  ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. మరోవైపు విమాన చార్జీలు, వసతి, రవాణా సదుపాయాలు అందుబాటు ధరల్లో లభించడంతోనూ నగరవాసులు వియత్నాంను ఎంపిక చేసుకుంటున్నారు.  

ద్వితీయ స్థానంలో శ్రీలంక.. 
ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి 22 అంతర్జాతీయ నగరాలకు నేరుగా విమాన సరీ్వసులు నడుస్తున్నాయి. ప్రతిరోజూ సుమారు 15వేల మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నారు. సాధారణంగా శ్రీలంక, థాయ్‌లాండ్, మాల్దీవులు, ఇండోనేíÙయా వంటి దేశాలను పర్యాటకులు ఎక్కువగా ఎంపిక చేసుకుంటారు. వీసాలు సులభంగా లభించడంతో పాటు ట్రావెల్స్‌ సంస్థల ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. గత ఏడాది 95,704 మంది శ్రీలంకకు రాకపోకలు సాగించారు. ఈ ఆర్థిక సంవత్సరం పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కేవలం  13 శాతం అధికంగా  (1,08,345) మాత్రమే  ప్రయాణం చేశారు. వి యత్నాం వెళ్లే వారి సంఖ్య ఏడాదిలో 35 వేల నుంచి 95 వేలకు పెరిగింది. 166 శాతం  వృద్ధి రేటు నమోదైనట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి.  

ప్రయాణం.. సులభం.. 
ప్రస్తుతం హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి వియత్నాంలోని హనోయ్, హోచిమిన్‌ నగరాలకు వియత్నాం ఎయిర్‌లైన్స్, వియట్‌ జెట్‌లకు చెందిన విమానాలు వారానికి 3 సరీ్వసుల చొప్పున నడుస్తున్నాయి. కనెక్టింగ్‌ ఫ్లైట్‌ల కోసం పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌ నుంచి కేవలం 4.30 గంటల్లోనే నేరుగా  వియత్నాం చేరుకోవచ్చు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)