Breaking News

ఒక్కటే సిగ్నల్‌.. కళ్లు బయర్లు కమ్మే చలాన్లు!! ఎట్టకేలకు చిక్కాడిలా..

Published on Wed, 10/22/2025 - 09:20

ఈ మధ్య సోషల్‌ మీడియాలో బైకులపై ఉన్న చలాన్ల గురించి నడుస్తున్న చర్చ గురించి తెలిసిందే. వేలల నుంచి లక్షల దాకా చలాన్లు ఉన్న బైకుల ఫొటోలను కొందరు తరచూ వైరల్‌ చేస్తున్నారు. అక్కడ ఆ అవసరం లేకుండానే పోలీసులకు చిక్కాడు ఓ చలాన్ల ధీరుడు!

హైదరాబాద్‌: : తరచూ ఓ ద్విచక్ర వాహనదారుడు రాంగ్‌రూట్లో వెళ్లడంతో ఆటోమెటిక్‌ సీసీ కెమెరా ద్వారా రూ.58895 జరిమానా పడినట్లు గుర్తించిన వనస్థలిపురం ట్రాఫిక్‌ పోలీసులు సదరు వాహనాన్ని సీజ్‌ చేశారు. సంఘటనకు సంబందించి వనస్థలిపురం ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ భూపతిగట్టుమల్లు తెలిపిన వివరాల ప్రకారం వనస్థలిపురం ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హస్తినాపురం సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు విలియంకేరికి చెందిన బైక్‌ నంబర్‌ ఏపి37డీఎస్‌ 3639 వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ఏకంగా రూ.58895 పెండింగ్‌ చలాన్‌లు ఉన్నట్లు గుర్తించారు. 

అతను ప్రతిరోజు గుర్రంగూడ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే యూటర్న్‌ వద్ద రాంగ్‌రూట్లో ఒక్కోరోజు నాలుగైదు సార్లు వెళితే నాలుగైదు జరిమానాలు ఆటోమెటిక్‌గా జరిమానాలు పడినట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. వాహనాన్ని సీజ్‌చేసిన పోలీసులు పెండింగ్‌ చలానాలు చెల్లించి వాహనాన్ని తీసుకెళ్లాలని యజమానికి సూచించారు. దీంతో అతను డబ్బులు చెల్లించి బైక్‌ తీసుకెళతానని చెప్పి వెళ్లినట్లు సీఐ  తెలిపారు.  

వనస్థలిపురం ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని విజయవాడ, నాగార్జున జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన యూటర్న్‌ల వద్ద ట్రాఫిక్‌ పోలీసులు లేరనే ఉద్దేశంతో వాహనదారులు రాంగ్‌రూట్లో వెళుతున్నారు. ప్రతి యూటర్న్‌ వద్ద తాము ఆటోమేటిక్‌ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఈ యూటర్న్‌ లు ఉన్న ప్రాంతంలో వాహనదారులు రోజుకు ఎన్నిసార్లు  రాంగ్‌ రూట్లో వెళితే అన్ని సార్లు రూ. 1235 చొప్పున జరిమానా  పడుతుందన్నారు. ప్రతిఒక్కరూ గమనించి రాంగ్‌రూట్లో వెళ్లవద్దని, జరిమానాలే కాకుండా ప్రమాదాలు జరిగి ప్రాణాలు సైతం పోగొట్టుకునే పరిస్థితి వస్తుందని సీఐ హెచ్చరించారు.

 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు