Breaking News

హైదరాబాద్‌: అంటువ్యాధులు, మహమ్మారుల సన్నద్ధతపై ప్రత్యేక కేంద్రం  

Published on Mon, 02/20/2023 - 03:34

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ టీకాల తయారీ సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌లో అంటువ్యాధులు, మహమ్మారుల సన్నద్ధతపై సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీవోఈ)ను ఏర్పాటు చేయనుంది. నగరంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఐఐపీఎం) ఆవరణలో ఈ కేంద్రాన్ని డాక్టర్‌ సైరస్‌ పూనావాలా పేరిట నెలకొల్పనుంది. ఈ మేరకు సీరమ్‌ సంస్థ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌లో వర్చువల్‌గా జరిగిన ఒక కార్యక్రమంలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఈ మేరకు ప్రకటించింది. ప్రజారోగ్య అత్యవసర సమయాల్లో సమాచారం, వనరులు, సాయం అందించేందుకు దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

ప్రజారోగ్యంపై చైతన్యం, అంటువ్యాధుల వ్యాప్తిపై స్పందించేలా దీన్ని తీర్చిదిద్దనుంది. పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ దేశవ్యాప్తంగా స్థాపించిన ఐదు సంస్థలలో ఇదొకటి. గతేడాది దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సమావేశాల సందర్భంగా సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ అదర్‌ పూనావాలాతో రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ సీవోఈ ఏర్పాటుపై చర్చించారు.

ఆదివారం వర్చువల్‌ సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితికి సీవోఈ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రపంచంలోనే వ్యాక్సిన్‌ రాజధానిగా పరిగణించబడే హైదరాబాద్‌ నగరానికి అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీవోఈని నెలకొల్పుతుండటాన్ని ఆయన స్వాగతించారు. ఐఐపీఎం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ వ్యాధుల నివారణ, మహమ్మారి ముప్పులను అంచనా వేయడానికి, నివారించడానికి, తగ్గించడానికి సీవోఈ సహాయపడుతుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తి ఎం. నాగప్పన్‌ పాల్గొన్నారు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)