Breaking News

కారుతో ఢీకొట్టి.. తుపాకీతో కాల్చి..

Published on Sat, 08/10/2024 - 06:56

పహాడీషరీఫ్‌: బైక్‌పై వెళ్తున్న రౌడీషీటర్‌ను గుర్తు తెలియని దుండగులు కారుతో ఢీ కొట్టి.. కళ్లలో కారం చల్లి.. తుపాకీతో కాలి్చ.. కత్తులతో నరికి చంపిన దారుణ ఘటన బాలాపూర్‌ పీఎస్‌ పరిధిలో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌పేట్‌ షరీఫ్‌నగర్‌లో నివాసం ఉండే రియాజుద్దీన్‌ అలియాస్‌ మెంటర్‌ రియాజ్‌ (45) లలితాబాగ్‌ రక్షాపురంలో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. గురువారం రాత్రి రాయల్‌ కాలనీలో జరిగిన ఓ విందుకు హాజరై.. స్నేహితుడు నజీర్‌తో కలిసి బాలాపూర్‌లోని వైన్స్‌లో మద్యం తాగారు.

అనంతరం రాత్రి 10.30 గంటలకు నజీర్‌ ఇంటికి వెళ్లగా, రియాజ్‌ తన బైక్‌పై షరీఫ్‌నగర్‌కు బయల్దేరాడు. ఆర్సీఐ రోడ్డులో ‘మంచి’ స్కూల్‌ వద్దకు రాగానే ముందస్తు పథకంలో భాగంగా వెనక నుంచి కారులో వచి్చన దుండగులు బైక్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో రియాజ్‌ కింద పడిపోగా.. కళ్లలో కారం చల్లి, తుపాకీతో ఛాతీలో ఒక రౌండ్‌ కాల్పులు జరిపారు. అయినప్పటికీ కొన ఊపిరితో ఉన్నాడని భావించి కత్తులతో తల, ఛాతీ భాగాల్లో ఇష్టానుసారంగా పొడిచారు. 

వచి్చన కారులోనే పరారయ్యారు.  కొద్దిసేపటి తర్వాత వాహనదారుల ద్వారా సమాచారం అందుకున్న బాలాపూర్‌ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లగా.. రక్తపు మడుగులో పడి ఉన్న రియాజ్‌ అప్పటికే మృతి చెందాడు. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సు«దీర్‌బాబు, మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, బాలాపూర్, పహాడీషరీఫ్‌ ఇన్‌స్పెక్టర్లు భూపతి, గురువారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. హత్యకు వినియోగించిన బుల్లెట్‌ షెల్‌తో పాటు ఐరన్‌ రాడ్డును స్వా«దీనం చేసుకున్నారు. 

క్లూస్‌ టీంతో శాంపిళ్లు సేకరించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పాత కక్షల కారణంగానే హత్య జరిగి ఉంటుందని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని సీపీ తెలిపారు.  రియాజ్‌తో పాటు మద్యం తాగిన నజీర్‌ ఇచి్చన పక్కా సమాచారంతోనే నిందితులు వెంబడించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈమేరకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.  

 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)