Breaking News

11 ఏళ్ల తర్వాత ఇదే అత్యధికం

Published on Wed, 07/15/2026 - 08:20

సాక్షి, హైదరాబాద్‌: మండు వేసవి కాకున్నా.. మహా నగరంలో 4–5 రోజులుగా ఎండ దంచుతోంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ప్రస్తుత సమయంలో సాధారణంగా ఉండే చల్లటి వాతావరణానికి భిన్నంగా పగటి పూట పొడి వాతావరణం నెలకొంది. ఈ తాత్కాలిక మార్పులను రుతుపవన విరామంగా విశ్లేíÙస్తున్నారు. 2015 జూలైలో ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు బలహీనపడి, సుదీర్ఘ వాతావరణ విరామం ఏర్పడింది. నాడు జూలైలో నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4–5 డిగ్రీలు పెరిగి, 35.5–36 డిగ్రీల మధ్య నమోదై రికార్డు సృష్టించాయి.  

జూలైలో హైదరాబాద్‌ సగటు గరిష్ట ఉష్ణోగ్రత 30–31 డిగ్రీల మధ్య ఉండాలి. కానీ, ఇప్పుడు 34 డిగ్రీలు దాటుతోంది. రాత్రిళ్లు సైతం కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 డిగ్రీలు పెరిగి 25 డిగ్రీల కంటే ఎక్కువ నమోదవుతోంది. ప్రస్తుత సీజన్‌లో తీవ్రమైన ఎండ కంటే నిరంతరాయంగా ఆకాశంలో మేఘాలు లేకపోవడమే ఈ మార్పునకు ప్రధాన కారణం. బంగాళాఖాతంలో అల్పపీడనాలు లేని ప్రతిసారీ జూలైలో ఇలా ఉష్ణోగ్రతలు పెరగడం సహజమని నిపుణులు చెబుతున్నారు. మరో 3–4 రోజులు నగరంలో ఇదే పరిస్థితి ఉంటుందని, నైరుతి రుతుపవనాలు పుంజుకుని, ఈ నెల మూడో వారం నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 

కూలర్లు, ఏసీలు మళ్లీ వినియోగంలోకి 
రాత్రిపూట ఉక్కపోతతో గ్రేటర్‌ జిల్లాల వాసులు ఉక్కిరిబిక్కిరికి లోనవుతున్నారు. తొలకరి వర్షాలతో స్విచ్‌ ఆఫ్‌ అయిన కూలర్లు, ఏసీలు మళ్లీ వినియోగంలోకి వస్తున్నాయి. దీంతో విద్యుత్‌ డిమాండ్‌ మళ్లీ గరిష్ట స్థాయికి చేరుతోంది. అర్థరాత్రి ఒక్కసారిగా డిమాండ్‌తో ఫీడర్లు ఒత్తిడికి గురై తరచూ ట్రిప్పవుతున్నాయి.  కరెంట్‌ లేక అపార్ట్‌మెంట్లలో లిఫ్ట్‌లు నిలిచిపోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో 1912 కాల్‌ సెంటర్, ఎక్స్, ఫేస్‌బుక్, వాట్సాప్‌ చాట్‌బోట్, సెంట్రల్‌ బ్రేక్‌డౌన్‌ బృందాల నంబర్లకు ఫోన్‌ చేసినా ఫలితం ఉండటం లేదు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)