Breaking News

హైదరాబాద్‌: రూ.2.30 కోట్లు పలికిన గణేశ్‌ లడ్డూ

Published on Sat, 09/06/2025 - 07:03

సాక్షి, హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ పరిదిలో గణపతి లడ్డూ వేలం రికార్డు సృష్టించింది. బండ్లగూడ కీర్తి రిచ్‌మండ్‌ విల్లాలో రూ.2 కోట్ల 30 లక్షల రికార్డు ధర పలికింది. శుక్రవారం రాత్రి జరిగిన వేలం పాటలో 10 కేజీల లడ్డును బాలాగణేష్‌ టీం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది ఇదే విల్లాలో జరిగిన వేలంపాటలో రూ.1.87 కోట్లకు లడ్డూ పోగా.. ఈసారి రూ.45 లక్షలు అదనంగా వెళ్లింది. మొత్తం 80 విల్లా ఓనర్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి 500కి పైగా బిడ్లతో ఈ వేలంపాటలో పాల్గొన్నారు. సుమారు రెండున్నర గంటలపాటు ఈ వేలంపాట సాగడం గమనార్హం. 

42 ఎన్జీవోలను నిర్వహించే ఓ ట్రస్టుకు ఈ డబ్బును విరాళంగా ఇవ్వబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పూర్తిగా వలంటీర్లతో నడిచే ఈ ట్రస్ట్‌ ద్వారా 10 వేల మందికి సాయం అందుతోంది, ప్రతీ పైసా నేరుగా క్షేత్రస్థాయిలోకే వెళ్తుందని అంటున్నారు. 

ఈ విల్లాలో 2018 నుంచి లడ్డూ వేలంపాట నడుస్తోంది. ఆ టైంలో రూ.25 వేలకు లడ్డూ పోయింది.  2019లో రూ. 18.75,  2020లో రూ.27.3లక్షలు, 2021లో రూ. 41 లక్షలు, 2022లో రూ.60 లక్షలు, 2023లో రూ.1.26 కోట్లకు పోయింది. మనస్పర్థలు రాకూడదనే గ్రూపులుగా విడిపోయి లడ్డూ వేలంపాటలో పాల్గొంటున్నారు. అయితే లడ్డూను మాత్రం అన్ని కుటుంబాలు కలిసే పంచుకుంటాయని చెబుతున్నారు.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు