Breaking News

హైద‌రాబాద్‌లో ఇల్లు క‌డుతున్నారా.. ఇది తెలుసుకోండి

Published on Fri, 05/30/2025 - 19:48

‘మూడు వందల చదరపు గజాలకుపైగా ఉన్న ప్రతీ ఇంటి ప్రాంగణంలో ఇంకుడు గుంత నిర్మించుకోవాలి. భూగర్భ జలాల పెంపు కోసం ఇంకుడు గుంత తప్పనిసరి. లేనిపక్షంలో ప్రత్యేక కార్యాచరణకు దిగుతాం’ 
– ఇటీవల హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ వ్యాఖ్య

సాక్షి, హైద‌రాబాద్‌: సీవరేజీ ఓవర్‌ఫ్లో కట్టడి, మోటార్‌ ఫ్రీ వాటర్‌ సరఫరా స్పెషల్‌ డ్రైవ్‌లతో సత్ఫలితాలు సాధిస్తున్న జలమండలి.. తాజాగా భూగర్భ జలాల పెంపు కోసం 90 రోజుల వర్షాకాల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ‘ప్రతి ఇంటా ఇంకుడు గుంత’ నిర్మించుకునే విధంగా స్పెషల్‌ డ్రైవ్‌కు సిద్ధమైంది. నలుదిశలా అత్యంత వేగంగా విస్తరిస్తున్న మహానగరం పూర్తిగా కాంక్రీట్‌ జంగిల్‌గా మారుతుండటంతో వర్షం చినుకు భూమిలో ఇంకే పరిస్థితి లేక భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. 

సిటీజనులకు తాగునీరే కాదు.. నిత్యావసరాలకు వినియోగించే నీళ్లకు కూడా కష్టాలు తప్పడం లేదు. దీంతో వాటర్‌ ట్యాంకర్ల సరఫరా జలమండలికి తలకు మించిన భారంగా పరిణమించింది. పెరుగుతున్న జనావాసాలకు తగ్గట్లు ప్రధాన జలాశయాల నుంచి నీటి కేటాయింపు లేకున్నా.. తరలిస్తున్న నీటినే సర్దుబాటు చేస్తూ వస్తున్న జలమండలి ఇక ప్రతి ఇంటా ఇంకుడు గుంతల నిర్మాణాలతో భూగర్భ జలాలను పెంపొందించే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 
 
ఇక నుంచి తప్పనిసరి..  
మహా నగర పరిధిలో భూగర్భ జలాల పెంపొందించేందుకు జలమండలి కసరత్తు ప్రారంభించింది. సుమారు 300 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో భవన సముదాయాలకు ఇంకుడు గుంత తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వరల్డ్‌ వాటర్‌ డే (World Water Day) సందర్భంగా ఇంకుడు గుంతల సర్వే కోసం ప్రత్యేకంగా ఒక అప్లికేషన్‌ రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చింది. గృహ సముదాయాల క్యాన్‌ నంబర్ల ఆధారంగా ఇంకుడు గుంతలపై సర్వే నిర్వహించింది. 

చ‌ద‌వండి: హైసిటీ ప‌నుల్లో మ‌రో ముంద‌డుగు

వాల్టా చట్టం ప్రకారం.. 300 చదరపు గజాలు.. అంతకంటే ఎక్కువ విస్తీరణంలోని గృహ సముదాయాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేపటాల్సిందే. మరోవైపు జలమండలి నల్లా కనెక్షన్ల అనుమతి పత్రంలో సైతం ఇంకుడు గుంతల ఏర్పాటు షరతు ఉంటుంది. భవన నిర్మాణ సమయంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నా.. వాటిపై నిర్లక్ష్యం, కాలక్రమేణా వాటిని పునరుద్ధరించకపోవడంతో భూగర్భ జలాల అడుగంటే పరిస్థితి నెలకొనడం అనివార్యంగా తయారైంది. మరికొన్ని గృహ సముదాయాల్లో అసలు ఇంకుడు గుంతల నిర్మాణమే చేపట్టని పరిస్థితి కూడా లేకపోలేదు. 

కనిపించని ఆసక్తి 
రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ పథకంలో భాగంగా ‘ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత’ అనే పేరుతో  అవగాహన కల్పించినా.. నివాస సముదాయాలు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. చివరకు ఇంకుడు గుంతలు లేని గృహ సముదాయాలకు గడువు విధించి నోటీసులు జారీ చేయగా.. అందులో కొందరే స్పందించగా.. మిగతావారి నుంచి స్పందన లేకుండా పోయింది. 

నోటీసు అందినా ఇంకుడు గుంతను నిర్మించుకోని భవన యజమానులు ట్యాంకర్‌ బుకింగ్‌ చేస్తే రెట్టింపు చార్జీ విధించాలని భావించినా.. వేసవి కాలంలో నీటి అత్యవసరం దృష్ట్యా మానవతా దృక్పథంతో జలమండలి వెనుకడుగు వేసింది. ప్రతి వేసవిలో సుమారు 42 వేలపైగా గృహ సముదాయాల నుంచే అత్యధికంగా ట్యాంకర్లు బుకింగ్‌ జరుగుతున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వర్షాకాలంలో మాత్రం ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మాణాలపై అవసరమైతే కఠిన నిర్ణయాలు సైతం అమలు చేసేందుకు జలమండలి సిద్ధమవుతోంది.

భూగర్భ జలాలను పెంచేందుకే.. 
భూగర్భ జలాల పెంపు కోసమే ప్రతి ఇంటా ఇంకుడు గుంత తప్పనిసరి చేశాం. 90 రోజుల వర్షాకాల కార్యాచరణలో ప్రత్యేకంగా ఇంకుడు గుంతల నిర్మాణాలపై దృష్టి సారించాం. ప్రజలకు అవగాహన కల్పిస్తాం. ప్రోత్సహిస్తాం. కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాం. ఇంకుడు గుంతల నిర్మాణాలపై నిర్లక్ష్యం వహిస్తే మాత్రం చివరకు కఠిన నిర్ణయాలు అమలు చేస్తాం.  
– అశోక్‌ రెడ్డి, జలమండలి ఎండీ  

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)