Breaking News

బంజారాహిల్స్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. హోటల్‌లో స్రీకెట్‌గా..

Published on Fri, 10/24/2025 - 07:36

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–12లోని ఆర్‌–ఇన్‌ హోటల్‌లో ఓ గదిలో గత కొంతకాలంగా యువతులతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు గురువారం దాడులు చేసి ముగ్గురు యువతులతో సహా ఏడుగురు కస్టమర్లు, వ్యభిచార గృహ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు.

వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఎండీ షరీఫ్‌ గతంలో స్టైల్‌ మేకర్‌ సెలూన్‌ నిర్వహించేవాడు. ఉద్యోగాల పేరుతో వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి సెలూన్‌లో చేర్చుకుని వారిని అధిక డబ్బు సంపాదించవచ్చనే ఆశపెట్టి వ్యభిచారానికి తరలిస్తున్నాడు. కజకిస్థాన్, రష్యా, ఉగాండా, థాయ్‌ల్యాండ్, బంగ్లాదేశ్‌ తదితర దేశాల నుంచి తన సెలూన్‌లో ఉద్యోగాల పేరుతో రప్పించి వారిని ఖరీదైన హోటళ్లకు పంపిస్తూ వ్యభిచారం చేయిస్తున్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఆర్‌–ఇన్‌ హోటల్‌లోని గదులపై దాడులు చేసి ముగ్గురు మహిళా సెక్స్‌ వర్కర్లను అదుపులోకి తీసుకుని పునరావాస కేంద్రానికి తరలించారు. కజకిస్థాన్‌కు చెందిన యువతితో పాటు మరో ఇద్దరు యువతులు పట్టుబడిన వారిలో ఉన్నారు. మరో ఏడుగురు విటులకు నోటీసులు జారీ చేశారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఎండీ షరీఫ్‌పై కేసు నమోదు చేశారు. నగదును సీజ్‌ చేసి బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)