Breaking News

పబ్‌ను డ్యాన్స్‌ ఫ్లోర్‌గా మార్చిన యజమానుల రిమాండ్‌

Published on Tue, 10/22/2024 - 07:56

బంజారాహిల్స్‌: అడ్డదారుల్లో డబ్బులు సంపాదించేందుకు పబ్‌ను డ్యాన్స్‌ ఫ్లోర్‌గా మార్చి అశ్లీల నృత్యాలను ప్రోత్సహిస్తున్న పబ్‌ యజమానులను బంజారాహిల్స్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 3లోని టేల్స్‌ ఓవర్‌ ద స్పిరిట్‌ (టాస్‌) పబ్‌లో గత కొంతకాలంగా యువతులను ఎరగా వేసి యువకులతో భారీగా మద్యం తాగిస్తూ వారు మద్యం మత్తులో ఉండగా ఇష్టానుసారంగా బిల్లులు వేసి వసూలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్‌్కఫోర్స్‌ పోలీసులు రెండు రోజుల క్రితం ఈ పబ్‌పై దాడులు చేసి అర్ధనగ్న నృత్యాలు చేస్తూ యువకులకు ఎరవేస్తున్న 47 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు 95 మంది యువకులను అదుపులోకి తీసుకుని నోటీసులు ఇచ్చి పంపించారు. పబ్‌ యజమానులు బింగి బలరాం గౌడ్, బింగి శ్రీనివాస్‌గౌడ్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

వీరితో పాటు డీజే ప్లేయర్‌ ఆసిఫ్, నలుగురు  బౌన్సర్లు, మేనేజర్, బార్‌టెండర్లను కూడా అరెస్ట్‌ చేశారు. అదుపులోకి తీసుకున్న 42 మంది యువతుల్లో 10 మంది తరచూ పట్టుబడుతుండటంతో వారిని అరెస్ట్‌ చేశారు. ఇదిలా ఉండగా పబ్‌ను డ్యాన్స్‌ఫ్లోర్‌గా మార్చి నిబంధనలు అతిక్రమించిన యజమానులు బింగి బలరాంగౌడ్, శ్రీనివాస్‌గౌడ్‌లను అరెస్ట్‌ చేయడమే కాకుండా పబ్‌ను సీజ్‌ చేయాలని ఆర్డీవోకు లేఖ రాశారు. లైసెన్స్‌ను రద్దు చేయాలని కూడా ఎక్సైజ్‌ అధికారులకు లేఖ రాసినట్లు పోలీసులు తెలిపారు.  

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు