Breaking News

గాలిపటం వెంట పరుగెత్తి... దారితప్పిన బాలుడు .. ఆ తర్వాత!

Published on Tue, 01/17/2023 - 01:19

బంజారాహిల్స్‌: తెగిన గాలిపటం కోసం పరుగులు తీస్తూ ఓ బాలుడు తప్పిపోయిన ఘటన బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకోగా సీసీ కెమెరాల్లో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడకు చెందిన సింహాద్రి, అనసూయ దంపతులకు వినోదకుమార్‌ అనే 9 ఏళ్ల కొడుకు ఉండగా సంక్రాంతి పండుగకు 3 రోజుల క్రితం బంజారాహిల్స్‌ లోని ఇందిరానగర్‌ లో వుండే అమ్మమ్మ ఇంటికి వచ్చారు.

సోమవారం మధ్యాహ్నం వినోద్‌ తన తల్లి, అమ్మమ్మ తోకలిసి కేబీఆర్‌ పార్క్‌ వైపు వచ్చారు. అంతలోనే ఓ పతంగి తెగి గాలిలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో దాన్ని పట్టుకోవడానికి పరుగులు తీశారు. కొద్దిసేపట్లో తల్లి గమనించి కొడుకు కోసం గాలించింది. అక్కడే ఉన్న పోలీసులకు చెప్పి అంతటా వెతికింది.

కేబీఆర్‌ పార్క్‌ ఇంటర్సెప్టర్‌ 10 మెయిన్‌ గేట్‌ పోలీసు పీసీలు అక్షయకుమార్, మహేష్‌ కుమార్, హెచ్‌జీలు దినకర్, నరేష్, కృష్ణంరాజు స్పందించి పార్కు చుట్టూ గాలించారు. అనంతరం సీసీ కెమెరాల్లో పరిశీలించారు. అదే సమయంలో బాలుడు ఓ చోట కనిపించాడు. వెంటనే బాలుడిని గుర్తించి పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. ఓవైపు నెమళ్లు ఇంకోవైపు పతంగులు చూసి ఆనందంలో మునిగిపోయి వాటిని పట్టుకోవడానికి పరుగెత్తానని వినోద్‌ తెలిపారు.  

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)