Breaking News

గోషామహల్‌లో ఉద్రిక్తత.. పలువురు అరెస్ట్‌!

Published on Fri, 01/31/2025 - 10:20

సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి శంకుస్థాపన వేళ గోషామహల్‌లో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. గోషామహల్‌లో ఆసుపత్రి నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. సీఎం రేవంత్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో, నిరసనకారులను పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. ఈరోజు ఉదయం 11.54 గంటలకు గోషామహల్‌లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి శంకుస్థాపన చేయనున్నారు.  ఈ నేపథ్యంలో గోషామహల్‌ గ్రౌండ్‌లో ఆసుపత్రి నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఆసుపత్రి నిర్మాణానికి గోషామహల్ స్టేడియం కాకుండా ఇంకెక్కడైనా నిర్మాణం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అఖిలపక్షం ఏర్పాటు చేసి ఉస్మానియ ఆసుపత్రి నిర్మాణంపై ముందుకెళ్లాలని స్థానికుల సూచిస్తున్నారు.

మరోవైపు.. గోషామహల్‌లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సైతం స్పందించారు. ఈ సందర్భంగా రాజాసింగ్‌..‘ఇక్కడ ఆసుపత్రి నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచించాలి. గోషామహల్ గ్రౌండ్‌లో ఆసుపత్రి కడితే తమకు అనేక రోగాలతో పాటు, మార్చురీ వాసన వస్తుందని పక్కనే ఉన్న ప్రజలు భయపడుతున్నారు. అక్కడున్న ప్రజలతో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడాలి. అక్కడి ప్రజల గోడును వినండి. నేను కుంభమేళాలో ఉన్నందున నేటి కార్యక్రమానికి హాజరుకాలేపోతున్న అని వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా.. గోషామహల్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పురుషోత్తంను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. శుక్రవారం తెల్లవారుజామునే పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్బంగా పురుషోత్తం మాట్లాడుతూ..‘ఆసుపత్రి నిర్మాణం చేయాలనుకోవడం మంచిదే. కానీ, గోషామహల్‌ వంటి ఇరుకైన ప్రాంతంలో కాదు. ఊపిరాడకుండా ఉండే ఇరుకు ఇండ్లు, రోడ్ల మధ్య ఆసుపత్రి నిర్మాణం సరికాదు. వర్షం వస్తే ఇక్కడి రోడ్లు నదులను తలపిస్తాయి. స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ఈ నిర్ణయాన్ని పున:సమీక్ష చేసుకోవాలి అని కామెంట్స్‌ చేశారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)