Breaking News

ఉస్మానియా ఆస్పత్రి ఖాళీ

Published on Sat, 07/27/2024 - 08:34

అఫ్జల్‌గంజ్‌: పేదల పెద్దాసుపత్రిగా పేరుగాంచిన ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి పాత భవనానికి తాళం వేసి నేటికి నాలుగేళ్లు పూర్తవుతాయి. పాత భవనం మూసివేయడంతో ఆస్పత్రిలో స్థలాభావంతో అందుబాటులో ఉన్న స్థలంలోనే బెడ్లు సర్దుబాటు చేసి రోగులకు నాణ్యమైన వైద్య చికిత్సలు అందిస్తున్న ఉస్మానియా ఆస్పత్రికి ఇటీవల జరిగిన వైద్యుల బదిలీలు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. 

నాలుగేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఉస్మానియా ఆస్పత్రి పాత భవనంలోకి నీరు రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో అప్పటి ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పాండూ నాయక్‌ నేతృత్వంలోని పరిపాలన విభాగం అధికారులు పాత భవనానికి 2020, జూలై 27న తాళం వేశారు. 

అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ కులీకుతుబ్‌షా భవనంలో  నూతన షెడ్డును ఏర్పాటు చేసి రోగులకు సర్దుబాటు చేశారు. కాగా.. తాజాగా వైద్య శాఖలో జరిగిన బదిలీల్లో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.నాగేందర్‌తో పాటు నిష్టాతులైన దాదాపు 22 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతో కలిపి దాదాపు 60 మంది వైద్యులను ఒకేసారి బదిలీ చేయడంతో ఆస్పత్రి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)