HYD: హిమాచల్ వరదల్లో చిక్కుకున్న ఉస్మానియా డాక్టర్లు!

Published on Tue, 07/11/2023 - 18:15

సాక్షి, హైదరాబాద్‌: వాతావరణంలో నెలకొన్న అనూహ్య పరిణామాలతో ఉత్తర భారతాన్ని ఎడతెరిపి ఇవ్వని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.  ఎటు చూసినా వరద పోటెత్తిన దృశ్యాలు.. మనుషులు, వాహనాలు, భవనాలు కొట్టుకుపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాల ధాటికి 72 మంది మృతిచెందగా.. 10 మంది అదృశ్యమయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ ఉస్మానియాకు చెందిన ముగ్గురు వైద్యులు హిమాచల్‌ ప్రదేశ్‌ వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం. 

హిమాచల్‌ ప్రదేశ్‌ వరదల్లో ఉస్మానియాకు చెందిన డాక్టర్‌ బానోత్‌ కమల్‌లాల్‌, డాక్టర్‌ రోహిత్‌ సూరి, డాక్టర్‌ శ్రీనివాస్‌లు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురి ఫోన్లు స్విచ్చాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామానికి చెందిన మరింత సమాచారం అందాల్సి ఉంది. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన ఓ ఫ్యామిలీ సైతం ఉత్తరాది భీకర వర్షాల్లో చిక్కుకుపోగా.. ఆదివారం నుంచి కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోయాయి. అయితే.. చివరికి వాళ్లు సురక్షితంగా నగరానికి తిరుగు పయనమైనట్లు తేలింది.  

మంత్రి హరీష్‌ ఆరా
ఢిల్లీ పర్యటనలో భాగంగా.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తో మంత్రి హరీష్ రావు భేటీ కానున్నారు. కృష్ణా నది ట్రిబ్యునల్, నీటి ప్రాజెక్టుల అంశాలపై కేంద్రమంత్రితో చర్చించనున్నారాయన.  అదే సమయంలో.. హిమాచల్‌ వరదల్లో ఉస్మానియా వైద్యులు చిక్కుకుపోయిన పరిణామంపై వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆరా తీశారు. వైద్యులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారాయన. 

ఇదీ చదవండి: హిమాన్షు పెద్ద మనసు.. కోటి రూపాయలతో.. 

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)