Breaking News

పాతబస్తీలో శరవేగంగా మెట్రో విస్తరణ పనులు

Published on Mon, 04/14/2025 - 19:23

పాతబస్తీ మెట్రోరైల్‌ విస్తరణలో భాగంగా ఆస్తుల సేకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 205 ఆస్తుల సేకరణ పనులు పూర్తయ్యాయి. బాధిత కుటుంబాలకు  రూ.212 కోట్ల పరిహారం చెల్లించినట్లు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రోరైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు పాతబస్తీలోని లహోటీ బిల్డింగ్, అక్బర్‌ ఫంక్షన్‌ హాళ్లను తొలగించారు. షబ్బార్‌ కేఫ్, మీనా ప్లాజా, పిస్తాహౌజ్, స్వాగత్‌ హోటల్, ఆక్వా ప్యూరిఫైర్‌ షాప్, అక్బర్‌ మెకానిక్‌ షాప్, లిల్లీరోజ్‌ స్కూల్‌ భవనాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయని ఎన్వీఎస్‌ రెడ్డి (NVS Reddy) తెలిపారు. 
–సాక్షి, సిటీబ్యూరో

1,100 ఆస్తుల గుర్తింపు.. 
మెట్రో రెండో దశలో భాగంగా ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట (Chandrayangutta) వరకు 7.5 కిలోమీటర్ల మార్గంలో మెట్రో నిర్మాణం చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు  హెచ్‌ఏఎంఆర్‌ఎల్‌ పనులు చేపట్టింది. గత ఏడాది క్షేత్రస్థాయిలో భూమి సర్వే, మెట్రో కారిడార్‌ మార్కింగ్‌ అనంతరం ఆస్తుల సేకరణ, రోడ్డు విస్తరణపై  అధికారులు దృష్టి సారించారు. 7.5 కిలోమీటర్ల మార్గంలో మొత్తం 1,100 ఆస్తులను గుర్తించిన సంగతి తెలిసిందే. చదరపు గజానికి రూ.8,1000 నుంచి  రూ.లక్ష చొప్పున ధర నిర్ణయించి పరిహారం చెల్లించేందుకు చర్యలు చేపట్టారు. అదే క్రమంలో కూల్చివేత పనులు కూడా కొనసాగుతున్నాయి.

అత్యంత అప్రమత్తంగా.. 
ప్రస్తుతం వివిధ చోట్ల రోడ్లకు రెండు వైపులా చిక్కు ముడులుగా ఉన్న కొన్ని క్లిష్టమైన విద్యుత్, టెలిఫోన్‌ కేబుళ్లను అత్యంత అప్రమత్తంగా తొలగించి తమ ఇంజినీరింగ్‌ సిబ్బంది మార్గాన్ని సుగమం చేశారని మెట్రో ఎండీ వెల్లడించారు. మెట్రో అధికారులతో పాటు, రెవిన్యూ, పోలీసుల పర్యవేక్షణలో మెట్రో మార్గం విస్తరణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయన్నారు. ప్రభావిత ఆస్తుల యజమానులు స్వచ్ఛందంగా స్పందించి ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన నష్ట పరిహారాన్ని ఆమోదించి తమ ఆస్తులను మెట్రో మార్గం కోసం ఇచ్చారని చెప్పారు.  

7.5 కిలోమీటర్లకు రూ.2,714 కోట్లు
మెట్రో రెండో దశలో  మొదటి 5 కారిడార్‌లకు రూ.24,269 కోట్లతో సమగ్రమైన ప్రాజెక్టు నివేదికలను రూపొందించారు. ఇందులో భాగంగా ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్న 7.5 కిలోమీటర్ల  మెట్రో నిర్మాణంలో భాగంగా ఆస్తులు కోల్పోయిన వారికి చెల్లించే  పరిహారం కాకుండా సుమారు రూ.2,714 కోట్లు ప్రాజెక్టు ఖర్చు కానున్నట్లు అంచనా. దీంతో  జూబ్లీబస్‌స్టేషన్‌ నుంచి నేరుగా చాంద్రాయణగుట్ట వరకు రాకపోకలు సాగించేందుకు అవకాశం లభిస్తుంది. అలాగే.. చార్మినార్‌తో పాటు  వివిధ ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు  మెట్రో రైల్‌  రవాణా సదుపాయాన్ని అందజేయనుంది.

చాంద్రాయణగుట్ట  నుంచి ఎయిర్‌పోర్టు (Airport) వరకు మెట్రో విస్తరించనున్న సంగతి తెలిసిందే. చాంద్రాయణగుట్ట వద్ద అమీర్‌పేట్‌ తరహాలో అతిపెద్ద టెర్మినల్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇటు  జేబీఎస్‌ వద్ద అంతర్జాతీయ ప్రమాణాల మేరకు మెట్రో హబ్‌ను ఏర్పాటు చేసి రెండో దశలోనే నార్త్‌సిటీకి మెట్రో విస్తరణ చేపట్టాలనేది ప్రభుత్వ ప్రతిపాదన. నార్త్‌ సిటీతో పాటు, ఫోర్త్‌ సిటీ మెట్రో కారిడార్‌ల డీపీఆర్‌లను త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనున్నట్లు అధికారులు  తెలిపారు.

చ‌ద‌వండి: కంచ గ‌చ్చిబౌలి భూముల‌పై ప్ర‌ధాని మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కేంద్రం అనుమతి రాగానే.. 
ఇప్పటికే రోడ్డు విస్తరణ కోసం పలు భవనాలు, కట్టడాలను కూల్చివేసి  నిర్మాణ వ్యర్థాలను కూడా తొలగించినట్లు పేర్కొన్నారు. మరోవైపు సున్నితమైన కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అన్ని విధాలా  జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎన్వీఎస్‌ రెడ్డి స్పష్టం చేశారు. రంజాన్‌ సందర్బంగా విస్తరణ పనుల వేగం కొంత తగ్గినప్పటికీ, ప్రస్తుతం తిరిగి వేగం పుంజుకున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanath Reddy) ఆదేశాల మేరకు త్వరితగతిన పాత నగరం విస్తరణ పనులు పూర్తి చేసి, కేంద్రం అనుమతి లభించిన వెంటనే మెట్రో నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు.     

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)