Breaking News

ముషీరాబాద్‌ డివిజన్‌లో దారుణం..

Published on Mon, 12/08/2025 - 15:12

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. ముషీరాబాద్‌ డివిజన్‌లో ఓ యువతి తన ఇంట్లో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. 

బౌద్ధనగర్‌ పరిధిలోని బాపూజీ నగర్ పవిత్ర(17) అనే యువతి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది. సోమవారం మధ్యాహ్నా సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ యవకుడు ఇంట్లోకి దూరి కత్తితో పొడిచి చంపేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. 

ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఘటనా స్థలానికి భారీగా జనం చేరుకుంటుండగా.. పోలీసులు వాళ్లను చెదరగొట్టారు. పలు కోణాల్లో కేసును దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే..

మేనబావ పనే..!
పవిత్రను కిరాతకంగా హత్య చేసింది ఆమె మేన బావే ఉమాశంకరేనని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లికి నిరాకరించడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కన్నీళ్లు పెడుతున్నారు. టైల్స్ పనిచేసే ఉమా శంకర్ తాగుబోతు కావడంతో పెళ్లికి ఒప్పుకోలేదని.. దీంతో కక్ష పెంచుకొని ఉన్మాదిగా ఈ ఘోరానికి పాల్పడ్డారని తల్లిదండ్రులు అంటున్నారు. 

ఘటన స్థలంలో ఉమాశంకర్‌ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వంటగదిలో ఉన్న చాకును నేరానికి ఉపయోగించినట్లు ధృవీకరించుకున్నారు. బంధువుల ఫిర్యాదు నేపథ్యంలో పరారీలో ఉన్న నిందితుడి కోసం వారాసిగూడ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)