Breaking News

హైదరాబాద్‌: కోఠి చోరీ కేసులో పురోగతి

Published on Sat, 01/31/2026 - 08:07

సాక్షి, హైదరాబాద్‌: కోఠి ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం వద్ద చోరీ కేసులో పురోగతి చోటు చేసుకుంది. బాధితుడి స్కూటీ మీద పారిపోయిన నిందితులు.. దానిని కాచిగూడ రైల్వే స్టేషన్‌ సమీపంలో వదిలి వెళ్లారు. ఈ క్రమంలో కొన్ని క్లూస్‌ను పోలీసు ప్రత్యేక బృందాలు సేకరించాయి. 

చోరీ అనంతరం నేరుగా కాచిగూడ డీమార్డ్‌ సమీపంలోని ఓ ప్రార్థనా మందిరంలోకి వెళ్లిన నిందితులు.. దుస్తులు మార్చుకున్నారు. అటుపై స్కూటీని స్టేషన్‌ దగ్గర వదిలి వెళ్లిపోయారు. అయితే అక్కడి నుంచి రైలెక్కి పారిపోయారా? లేదంటే బస్సు, ఇతర వాహనంలో పారిపోయారా? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ క్రమంలో కాచిగూడ పరిధిలోని ప్రధాన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

కోఠిలో ఈ ఉదయం జరిగిన చోరీ.. నగరవాసుల్ని ఉలిక్కి పడేలా చేసింది. రిన్షాద్‌(26) అనే వ్యక్తి శనివారం ఉదయం 7గం. ప్రాంతంలో తన డబ్బు డిపాజిట్‌ చేయడానికి కోఠి హెడ్‌ ఆఫీస్‌ బయట ఉన్న ఏటీఎం వద్దకు వెళ్లాడు. అతన్ని ఫాలో అవుతూ వచ్చిన ఐదుగురు దుండగులు.. తుపాకీతో బెదిరించారు. వాళ్లను అడ్డుకునేందుకు రిన్షాద్‌ ప్రయత్నించగా రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ క్రమంలో రిన్షాద్‌ కాలి నుంచి బుల్లెట్‌ దూసుకెళ్లింది. ఆ కంగారులో నగదు బ్యాగుతో బాధితుడి బైక్‌ మీదే దుండగులు పారిపోయారు. 

గాయపడిన రిన్షాద్‌ను స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అతనికి ప్రాణహాని తప్పిందని వైద్యులు ప్రకటించారు.  సమాచారం అందుకున్న సుల్తాన్‌బజార్‌ పీఎస్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా నిందితులను ట్రేస్‌ చేసే పనిలో ఉన్నారు. 

రిన్షాద్‌ నాంపల్లిలో బట్టల వ్యాపారి అని, తన రూ.6 లక్షల నగుదును డిపాజిట్‌ చేసేందుకు వచ్చిన క్రమంలోనే చోరీ జరిగిందని ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పావల్లి మీడియాకు వెల్లడించారు. క్లూస్‌ టీం ఘటనా స్థలం నుంచి రెండు షెల్స్‌ని స్వాధీనం చేసుకున్నాయన్నారు. కేవలం దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే కాలిలో కాల్చి నగదు ఎత్తుకెళ్లి ఉంటారని.. నిందితులు పాత నేరస్తులై ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశారామె. నిందితుల పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారామె.

 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)