Breaking News

సికింద్రాబాద్‌లోని అపార్ట్‌మెంట్‌లో పేలుడు..

Published on Sat, 09/03/2022 - 13:27

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్ రాంగోపాల్‌పేటలోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. అపార్ట్‌మెంట్‌లోని మొదటి అంతస్థులో సంభవించిన పేలుడు ధాటికి ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యింది. పేలుడు సంభ‌వించిన‌ప్పుడు భారీ శ‌బ్దం రావ‌డంతో స్థానికులు ఉలిక్కిప‌డ్డారు. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరికి గాయాలవ్వగా సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రికి ఆసుపత్రికి తరలించారు. దంపతులిద్దరిని నేపాల్ వాసులు  సందీప్‌, అనుగా గుర్తించారు. 20 రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చిన  ఈ జంట ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. 

సికింద్రాబాద్‌ పేలుడు ఘటనను పోలీసులు నిర్ధారించారు. గ్యాస్‌ లీక్‌ అవ్వడం వల్ల పేలుడు జరిగినట్లు తెలిపారు. సిలిండర్‌ లీక్‌ కావడంతో రూమ్‌ అంతా గ్యాస్‌ నిండినట్లు, వంట చేయడం కోసం గ్యాస్‌ వెలిగించడంతో సిలిండర్‌ పేలినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో క్లూస్‌ టీం తనిఖీలు చేపట్టింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ముందు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. కేసీఆర్ సర్కార్‌పై నిర్మల ఫైర్‌

Videos

ఖాళీ కుర్చీలతో మహానాడు.. తొలిరోజే అట్టర్ ఫ్లాప్

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)