చేప ప్రసాదం.. ఏర్పాట్లు ముమ్మరం

Published on Sat, 06/06/2026 - 10:49

హైదరాబాద్‌: మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో అస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడానికి బత్తిని కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేశారు. ఈ నెల 8న రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు రాత్రి వరకు కొనసాగుతుందని బత్తిని గౌరిశంకర్‌ గౌడ్‌ తెలిపారు. చేప ప్రసాదం తయారీలో భాగంగా ఈ నెల 7వ తేదీన ఉదయం 11 గంటలకు దూద్‌బౌలిలోని స్వగృహంలో సత్యనారాయణ స్వామివ్రతం, బావి పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.  8న ఉదయం చేప ప్రసాదాన్ని తయారు చేసిన అనంతరం దూద్‌బౌలిలోని స్వగృహంలో కుటుంబ సభ్యులంతా చేప ప్రసాదాన్ని తీసుకున్న అనంతరం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో  పంపిణీ ప్రారంభమవుతుంది. 

179 ఏళ్లుగా పంపిణీ  
చేప ప్రసాదానికి 179 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రతి ఏడాది పాతబస్తీ దూద్‌బౌలిలోని స్వగహంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇక్కడి బావి నీటితో చేప ప్రసాదాన్ని తయారు చేస్తారు. పూర్వీకుల నుంచి 1996 వరకు పాతబస్తీ దూద్‌బౌలిలో పంపిణీ జరిగిన చేప ప్రసాదం వివిధ కారణాలతో 2013 నుంచి  ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లోనే  కొనసాగుతూ వస్తోంది. ప్రసాదం పంపిణీకి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.   

50 కిలోల నుంచి 5 క్వింటాళ్ల వరకు.. 
మొదట్లో 50 కిలోల వరకు తయారు చేసిన ఈ చేప ప్రసాదం ప్రస్తుతం 5 క్వింటాళ్లకు చేరిందని అనిరుధ్‌ గౌడ్‌ తెలిపారు. మొదట్లో చేప మందుగా ప్రాచుర్యం పొంది అనంతరం చేప ప్రసాదంగా మారింది. భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్‌ సైతం చేప ప్రసాదం కోసం తమ వద్దకు వచ్చారని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

మూడు రకాల చేప ప్రసాదం... 
చేప మందును మూడు రకాలుగా తయారు చేస్తారు. చేపతో ఇచ్చే మందు, బెల్లంతో ఇచ్చే మందు, కార్తె మందు. 2 నుంచి 3 అంగుళాల కొరమీను చేపతో ఇచ్చే ప్రసాదంలు 10 గ్రాములుంటుంది. 30 గ్రాములు కలిగిన కార్తె మందును మూడు డోసులుగా 45 రోజుల పాటు వాడాలి. 15, 30, 45 రోజలలో కార్తె మందును వాడాలి. చేపతో మింగడం ఇష్టం లేని వారికి బెల్లం ప్రసాదాన్ని అందజేస్తారు. నిజానికి చేపతో తీసుకునే ప్రసాదమే ఫలితాలిస్తుందని చెబుతున్నారు. ప్రసాదం స్వీకరించే ముందు రెండు గంటల వరకు ఎలాంటి ఆహార పదార్థాలతో పాటు నీటిని కూడా స్వీకరించకూడదు. ప్రసాదం స్వీకరించిన అనంతరం గంటన్నర వరకు కూడా స్వీకరించకూడదు.    


 

Videos

నామినేషన్ కేంద్రాల వద్ద రాళ్ల గుట్టలు.. YSRCP నేతలే టార్గెట్..!

టైగర్ ష్రాఫ్ కేసులో కొత్త కోణాలు..

ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు దృష్టి..

పచ్చ కుట్ర జోరు.. రూ.600, బిర్యానీ ప్యాకెట్లు.. ఎన్నికల వేళ విద్యార్థులకు ఎర..

గుర్తుపెట్టుకో అనిత.. మేమిచ్చే రిటర్న్స్ గిఫ్ట్ కి దిమ్మతిరిగి బొమ్మ కనపడుద్ది

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు

వీళ్లు అసలు పోలీసులా రౌడీలా... YSRCP నేతలపై దాడులు.. సజ్జల స్టాంగ్ రియాక్షన్

అర్ధరాత్రి కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్.. పల్నాడులో హైటెన్షన్...

ఏపీలో నేటి నుంచి పరిషత్ పోరు.. నామినేషన్ల వేళ టెన్షన్!

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

Photos

+5

అపరంజి బొమ్మలా నభా నటేశ్ (ఫొటోలు)

+5

ఏపీలో ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎక్కడో తెలుసా?

+5

విజయవాడ : భవానీ భక్తులతో ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

విజయదశమి శుభాకాంక్షలు చెప్పిన సెలెబ్రెటీలు (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌