Breaking News

తాగి డ్రైవ్‌ చేయకూడదు.. సీపీ సజ్జనార్‌ హెచ్చరిక

Published on Wed, 12/31/2025 - 13:19

సాక్షి, హైదరాబాద్‌: న్యూ ఇయర్‌ వేడుకల వేళ మందుబాబులకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌. మద్యం తాగి వాహనాలు నడుపుతూ రోడ్లపైకి వస్తే ఉపేక్షించేది లేదన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చక్రవ్యూహంలో దొరికితే డైరెక్ట్‌ చంచల్‌గూడ జైలుకే వెళ్తారు అని హెచ్చరించారు.

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మరోసారి వీసీ సజ్జనార్‌ స్పందిస్తూ.. నగరంలోని 120 ప్రాంతాల్లో ఈరోజు రాత్రి ప్రత్యేక డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు ఉంటాయన్నారు. మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానా, వాహనాలను జప్తు, జైలు శిక్ష, డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దుచేస్తామని తెలిపారు. ఈ తనిఖీలు కేవ‌లం ఈ రోజుకే పరిమితం కాకుండా జనవరి మొదటి వారం అంతా కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే భారీ జరిమానా విధించడంతో పాటు, వాహనాన్ని సీజ్ చేస్తామని, అలాగే కోర్టు ద్వారా జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే ప్రక్రియను చేపడతామని హెచ్చరించారు.

ర్యాష్ డ్రైవింగ్, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. చక్రవ్యూహంతో సిటీలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు జరుగుతాయి. చక్రవ్యూహం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. చక్రవ్యూహంలో దొరికితే డైరెక్ట్‌ చంచల్‌గూడ జైలుకే వెళ్తారు. తాగి డ్రైవింగ్‌ చేస్తే నో షార్ట్‌ కట్స్‌.. నో స్మార్ట్‌ మూవ్స్‌ అంటూ హెచ్చరించారు.

CP Sajjanar: న్యూ ఇయర్‌కు హైదరాబాద్ రెడీ

అలాగే, కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రమే కాకుండా అతివేగంగా వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం, బహిరంగ ప్రదేశాల్లో నలుగురికి ఇబ్బంది కలిగించేలా న్యూసెన్స్ చేయడం వంటి పనులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు. మద్యం సేవించిన వారు బాధ్యతాయుతంగా వ్యవహరించి, స్వయంగా డ్రైవింగ్ చేయకుండా క్యాబ్ సేవలను లేదా డ్రైవర్లను ఆశ్రయించాలని సూచించారు. కొత్త సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి క్షేమంగా, సంతోషంగా జరుపుకోవాలని పోలీస్ యంత్రాంగం కోరింది. ర్యాష్‌ డ్రైవింగ్, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)