Breaking News

కమిషనరేట్‌లో భారీగా పెరిగిన మహిళా అధికారులు

Published on Wed, 06/11/2025 - 20:17

సాక్షి, హైదరాబాద్‌: నగర పోలీసు విభాగంలో మహిళా ఉన్నతాధికారుల సంఖ్య భారీగా పెరిగింది. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో డీసీపీ ఆపై స్థాయిలో పోస్టుల సంఖ్య 27 ఉండగా వీటిలో ఆరు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 21 పోస్టుల్లో పది మంది ఉమెన్‌ ఆఫీసర్లు ఉన్నారు. దీంతో ఉన్నతాధికారుల్లో మహిళల శాతం 50కు చేరుకుంది. సంయుక్త పోలీసు కమిషనర్‌ (పరిపాలన విభాగం) సహా ఇప్పటికే తొమ్మిది మంది మహిళా ఉన్నతాధికారులు ఉన్నారు. తాజాగా నగర నిఘా విభాగమైన స్పెషల్‌ బ్రాంచ్‌కు అపూర్వ రావును నియమించడంతో బాధ్యతలు స్వీకరించారు. త్వరలోనే ఈ నియామకానికి సంబంధించి పూర్తి స్థాయి ఉత్తర్వులు వెలువడనున్నాయి.  

సుదీర్ఘ కాలం పాటు లేని అవకాశం... 
ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ నగర పోలీసులో సుదీర్ఘ కాలం వరకు మహిళా ఉన్నతాధికారులకు ఆస్కారం ఉండేది కాదు. పోలీసు విభాగంలో వీరి సంఖ్య తక్కువగా ఉండటంతో పాటు ఉన్నత స్థాయిలో లేకపోవడం దీనికి ఒక కారణం. అయితే కాల క్రమంలో వీరి సంఖ్య కాస్త పెరిగినా... నగరంలో ఉన్న సున్నిత పరిస్థితులు, ఇతర కారణాల నేపథ్యంలో మహిళా అధికారులకు హైదరాబాద్‌లో పోస్టింగ్‌ ఇచ్చే వారు కాదు. ఇక్కడ హఠాత్తుగా తలెత్తే పరిణామాలతో పాటు మతకలహాలను అదుపు చేయడం, వేళాపాళా లేని విధులు వీరితో సాధ్యం కాదనే భావన గతంలో ఉండేది.

కాలక్రమంలో చోటు చేసుకున్న పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో నగర పోలీసు విభాగంలోనూ ఒక మహిళా ఉన్నతాధికారి ఉండాలని డీజీపీ కార్యాలయంతో పాటు ప్రభుత్వం భావించింది. అయితే చాన్నాళ్ళ వరకు కేవలం నార్త్‌జోన్‌కు మాత్రమే మహిళా అధికారిని నియమిస్తూ వచ్చారు. ఆ జోన్‌కు ఉండే ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సిటీ పోలీసు వింగ్‌లో మహిళ ఉన్నతాధికారి పోస్టు ఇది ఒక్కటే అనే భావన కొనసాగింది.

ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ రాకతో... 
ఈ కారణంగానే 2014కు పూర్వం నగరంలో పని చేసిన మహిళ ఉన్నతాధికారులు అంతా నార్త్‌జోన్‌ డీసీపీగా వ్యవహరించిన వారే. ఒక్క ఏఆర్‌ అనురాధ మాత్రం అదనపు సీపీగా వ్యవహరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్న ప్రభుత్వం ప్రత్యేకంగా ఉమెన్‌ సేఫ్టీ వింగ్, షీ–టీమ్స్‌కు రూపం ఇచ్చింది. దీంతో ఇందులో కచ్చితంగా మహిళ ఉన్నతాధికారులనే నియమించాల్సి వచ్చింది. ఈ పరిణామంతో నగరంలో మహిళా ఉన్నతాధికారుల సంఖ్య క్రమేణా పెరుగుతూ వచ్చింది.

ప్రస్తుతం సిటీ పోలీసు విభాగంలో డీసీపీ ఆపై స్థాయిలో పది మంది మహిళలు ఉన్నారు. మరో ఆసక్తికరమైన కోణం ఏమిటంటే... తొలిసారిగా ‘లోకల్స్‌’కు ఎక్కువ సంఖ్యలో ఉన్నతాధికారులుగా పోస్టింగ్‌ దక్కింది. నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్, సీసీఎస్‌ డీసీపీ శ్వేత, స్పెషల్‌ బ్రాంచ్‌ చీఫ్‌ అపూర్వ రావు, సౌత్‌ ఈస్ట్‌ డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ వైవీఎస్‌ సుదీంద్ర వీరంతా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారే కావడం గమనార్హం.  

సిటీ పోలీసులో మహిళా ఉన్నతాధికారులు వీరే.. 
పరిమళ నూతన్‌– పరిపాలన విభాగం సంయుక్త సీపీ 
రక్షిత మూర్తి– సీఏఆర్‌ హెడ్‌–క్వార్టర్స్‌ డీసీపీ  
అపూర్వ రావు– స్పెషల్‌ బ్రాంచ్‌ డీసీపీ 
సాధన – నార్త్‌జోన్‌ డీసీపీ 
శ్వేత– డిటెక్టివ్‌ డిపార్ట్‌మెంట్‌ డీసీపీ 
స్నేహ మెహ్రా– సౌత్‌ జోన్‌ డీసీపీ 
శిల్పవల్లి– మధ్య మండల డీసీపీ 
కవిత– ఉమెన్‌ సేఫ్టీ డీసీపీ  
లావణ్య జాదవ్‌– ఉమెన్‌ సేఫ్టీ డీసీపీ  
పుష్ప– ఐటీ సెల్‌ డీసీపీ

చ‌ద‌వండి: ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వేలో భారీ కుదుపు!

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)