Breaking News

షంషేర్‌.. చార్మినార్‌..

Published on Tue, 02/25/2025 - 12:24

ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) స్మారక చిహ్నాల జాబితా టాప్‌ 10లో నగరంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం చార్మినార్‌ చోటు దక్కించుకుంది. అంతేకాదు అత్యధిక సంఖ్యలో భారతీయ సందర్శకులను ఆకట్టుకుని వార్షిక పెరుగుదలలో దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచింది. 

అన్నింటికన్నా మిన్నగా.. 
గత 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జాబితాలో చార్మినార్‌ 9వ స్థానంలో నిలిచింది. దేశీయ పర్యాటకుల సంఖ్య 2022–23లో 9.29లక్షలు కాగా, గత ఏడాది 2023–24 కల్లా 12.9లక్షలకు పెరిగింది.  సందర్శకుల సంఖ్యలో పెరుగుదల 38 శాతానికి పైగా ఉండడంతో అన్ని ఏఎస్‌ఐ స్మారక చిహా్నల్లో కలిపి 10.8 శాతంగా ఉన్న మొత్తం కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది. గత 2022–23 ఆర్థిక సంవత్సరంలో అన్ని ఏఎస్‌ఐ స్మారక చిహా్నల్లో మొత్తం దేశీయ పర్యాటకుల సంఖ్య 479.01 లక్షలు కాగా ఇది 2023–24లో 530.9 లక్షలకు పెరిగింది.  

గోల్కొండ కోటకూ.. 
చారి్మనార్‌తో పాటు, నగరంలోని గోల్కొండ కోట కూడా అత్యధిక భారతీయ సందర్శకులను సాధించిన స్మారక చిహ్నాల జాబితాలో చోటు సంపాదించింది. ఈ చారిత్రక స్మారక చిహ్నాన్ని 2022–23లో 15.27 లక్షల మంది సందర్శించగా, 2023–24లో  5 శాతానికి పైగా పెరిగి 16.08 లక్షల మంది సందర్శించారు. ఇక అత్యధిక భారతీయ సందర్శకులను ఆకట్టుకున్న టాప్‌ 10  స్మారక చిహ్నాల జాబితాలో తాజ్‌ మహల్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ ఏడాది 20 శాతానికి పైగా సందర్శకుల సంఖ్యను పెంచుకుంది. అయితే ఇది చార్మినార్‌ పెరుగుదలతో పోలిస్తే తక్కువ కావడం గమనార్హం.

 

#

Tags : 1

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)