Breaking News

చందానగర్‌: నగల దుకాణంలో దొంగల ముఠా కాల్పులు

Published on Tue, 08/12/2025 - 11:48

సాక్షి, హైదరాబాద్‌: చందానగర్‌లో  పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ నగల షాపులోకి చొరబడి భారీ చోరీకి ప్రయత్నించారు. ఈ క్రమంలో రెండు రౌండ్ల కాల్పులు జరపగా.. ఓ వ్యక్తి గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. 

మంగళవారం ఉదయం చందానగర్‌లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెలరీ షాపు తెరిచిన ఐదు నిమిషాలకే(10.35 గం.ప్రాంతంలో) లోపలికి చొరబడ్డ ఓ ముఠా.. లాకర్‌ తాళాలు ఇవ్వాలంటూ గన్‌ చూపించి అసిస్టెంట్‌ మేనేజర్‌ను బెదిరించారు. అందుకు అంగీకరించకపోవడంతో.. కాల్పులకు దిగారు. 

ఈ కాల్పుల్లో సిబ్బందిలోని సతీష్‌ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. దాడి సమయంలో నగల షాపులోకి సీసీకెమెరాలను దొంగలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ పగలగొట్టారు. అయితే.. సిబ్బంది చాకచక్యంగా అందించిన సమాచారంలో పోలీసులు దుకాణం వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ముఠా అక్కడి నుంచి పారిపోయింది. 

దుండగులు ఆర్సీపురం వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. గ్యాంగ్‌లో మొత్తం ఆరుగురు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నగల దుకాణంలోని వెండి సామాన్లను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. సీపీటీవీల్లో ఘటన తాలుకా దృశ్యాలు రికార్డయ్యాయి. మొత్తం పది బృందాలుగా ఏర్పడిన పోలీసులు దొంగల కోసం గాలింపు చేపట్టారు. సీపీ అవినాష్‌ మహంతి ఘటనా స్థలాన్ని పరిశీలించి మీడియాకు వివరాలను అందజేశారు.

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)