Breaking News

హైదరాబాద్‌: బేగంపేట ప్లై ఓవర్‌పై కారు బోల్తా

Published on Wed, 01/21/2026 - 07:39

సాక్షి, హైదరాబాద్‌: బేగంపేట ప్లై ఓవర్‌పై ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్న ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. డ్రైవింగ్ చేసిన వ్యక్తి.. కారు వదిలి పరారయ్యాడు. ఈ ఘటనలో నలుగురు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. కారు బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్ చేస్తున్నారు.

మరో ఘటనలో ఈ నెల 18న ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. పుప్పాలగూడ అల్కాపూర్‌ టౌన్‌షిప్‌లో నివసించే బోడ సచిన్‌(34) ఆదివారం ఉదయం చింతల్‌ బస్తీ నుంచి తన ఇంటికి వెళుతున్నాడు. ఫిలింనగర్‌లోని శంకర్‌ విల్లాస్‌ చౌరస్తాలో కారు అదుపు తప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో సచిన్‌ స్వల్ప గాయాలతో బయటపడి భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు.

ఫిలింనగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును స్టేషన్‌కు తరలించారు. ఈ కారు బోడ స్వర్ణలత అనే పేరు మీద ఉండగా, సచిన్‌ కారు నడుపుతూ ప్రమాదానికి కారకుడయ్యాడు. సచిన్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించారు. డ్రంకన్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించగా జీరో అని వచ్చింది. అయితే కారులో మాత్రం ఆరుకు పైగా విస్కీ బాటిళ్లు లభ్యమయ్యాయి. నిందితుడు రాత్రంతా మద్యంతాగి ఆదివారం మధ్యాహ్నం పట్టుబడడంతో డ్రంకన్‌ డ్రైవ్‌లో జీరో నమోదైనట్లు తెలుస్తున్నది. కారు డివైడర్‌ను ఢీకొట్టిన సమయంలో ఎయిర్‌ బెలూన్లు తెరుచుకోవడం, బోల్తా పడడంతో కారు నడుపుతున్న సచిన్‌ ప్రాణాలతో బయటపడ్డట్లుగా పోలీసులు గుర్తించారు. నిర్లక్ష్యానికి కారకుడైన సచిన్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)