Breaking News

మూసాపేట్‌లో బుల్లెట్‌ కలకలం

Published on Mon, 10/20/2025 - 08:14

హైదరాబాద్‌: మూసాపేట మెట్రో స్టేషన్‌లో ఓ బాలుడి వద్ద బుల్లెట్‌ దొరకడంతో కలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ బాలుడు (12) మూసాపేట పరిధి ప్రగతినగర్‌లో తల్లితో పాటు ఉంటూ స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. బాలుడి తల్లి.. తండ్రితో విడిపోయి గత ఆరేళ్లుగా బిహార్‌కు చెందిన మహమ్మద్‌ ఆలంతో కలిసి ఉంటోంది. అతను మూసాపేటలోని ప్రగతినగర్‌లో నివాసముంటూ ఫ్యాబ్రికేషన్‌ పనులు చేస్తుంటాడు. 

ఈ క్రమంలో బాలుడిని బాగా చదువుకోవాలని, ఆటలాడవద్దని తండ్రి మందలించటంతో ఇంటి నుంచి పారిపోవాలని, ఇంట్లో ఉన్న బ్యాగులో బట్టలు, డబ్బు తీసుకుని బయటకు వచ్చాడు. మూసాపేట మెట్రో స్టేషన్‌ వద్ద ఉండగా బాలుడి బ్యాగ్‌ను తనిఖీ చేయగా బుల్లెట్‌ కనిపించింది. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై వెంటనే కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు బాబును స్టేషన్‌కు తీసుకువెళ్లారు. 

అక్కడ సమాచారం రాబట్టగా ఇళ్లు వదిలి పెట్టి బయటకు వెళ్లిపోతున్నానని, బ్యాగులో బట్టలు, డబ్బులు తీసుకుని వెళుతున్నానని, తనకేమీ తెలియదన్నాడు. తల్లిదండ్రుల వివరాలు చెప్పటంతో ప్రగతినగర్‌కు వెళ్లి విచారించగా... మహమ్మద్‌ ఆలం తాత అన్సారీ ఆర్మీలో పనిచేసే వారని, తను చనిపోయినప్పటికి  ఆయన బుల్లెట్‌ అలాగే ఉందని, ఇటీవల బిహార్‌కు వెళ్లినప్పుడు బుల్లెట్‌ను శుభ్రం చేసి జ్ఞాపకంగా పర్సులో దాచుకున్నానని తెలిపాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 9 ఎంఎం కేట్రిడ్జ్‌ బుల్లెట్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)